- Telugu News Photo Gallery Healthy Relationship Tips: Don't do these things with your partner in a relationship even by mistake
Relationship: బీకేర్‌ఫుల్ కపుల్స్.. ఈ విషయాలపై దృష్టి పెట్టకపోతే రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ తప్పదట..!
Relationship Advice: నేటి బిజీ లైఫ్‌లో బంధాలు మరింత బలహీనంగా మారుతున్నాయి. చిన్న చిన్న మనస్పర్థలతో చాలామంది మధ్యలోనే రిలేషన్‌షిప్‌కు పుల్ స్టాప్ పెడుతున్నారు. సాధారణంగా చాలా సార్లు మేము మన రిలేషన్ షిప్ లో కొన్ని పొరపాట్లు చేస్తాం.. సరైన విధంగా అర్ధంచేసుకోకుంటే.. రిలేషన్ షిప్ విచ్ఛిన్నమవుతుంది. ప్రేమ, నమ్మకం, అర్ధం చేసుకునే గుణం లేకపోతే.. బంధాన్ని కొనసాగించడం కష్టం..
Updated on: Nov 11, 2023 | 1:56 PM

Relationship Advice: నేటి బిజీ లైఫ్‌లో బంధాలు మరింత బలహీనంగా మారుతున్నాయి. చిన్న చిన్న మనస్పర్థలతో చాలామంది మధ్యలోనే రిలేషన్‌షిప్‌కు పుల్ స్టాప్ పెడుతున్నారు. సాధారణంగా చాలా సార్లు మేము మన రిలేషన్ షిప్ లో కొన్ని పొరపాట్లు చేస్తాం.. సరైన విధంగా అర్ధంచేసుకోకుంటే.. రిలేషన్ షిప్ విచ్ఛిన్నమవుతుంది. ప్రేమ, నమ్మకం, అర్ధం చేసుకునే గుణం లేకపోతే.. బంధాన్ని కొనసాగించడం కష్టం.. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే.. రిలేషన్‌షిప్‌లో చాలా సమస్యలు వెంటాడుతాయి. అందుకే రిలేషన్‌షిప్‌లో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అప్పుడే.. ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు..

ముఖ్యంగా కొన్ని పొరపాట్లను చాలా మంది ప్రజలు పట్టించుకోరు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ సంబంధాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించాలనుకుంటే, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రిలేషన్ షిప్ లో చిన్న చిన్న విషయాలు మీ సంబంధాన్ని చెడగొట్టే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో.. మీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

కోపం.. అర్ధం చేసుకోలేని గుణం: మీరు ఏదైనా విషయంపై కోపంగా ఉంటే, వెంటనే మీ భాగస్వామికి తెలియజేయండి. ఎందుకంటే మీరు మీ కోపాన్ని అణచుకుంటే భవిష్యత్తులో అది బయటకు వస్తుంది. దాని కారణంగా మీ సంబంధం విచ్ఛిన్నమవుతుంది. అందువల్ల, మీ సంబంధం విచ్ఛిన్నం కాకూడదని మీరు కోరుకుంటే, మీరు వెంటనే మీ అభిప్రాయాలను తెలియజేయాలి.

సర్ప్రైజ్‌లు లేకపోతే లైఫ్ బోరే: రిలేషన్‌షిప్‌లో సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం చాలా ముఖ్యం.. మొదట్లో రిలేషన్‌షిప్‌లో ఒకరికొకరు సర్ప్రైజ్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తర్వాత మానేస్తారు.. అప్పుడు సంబంధం బోరింగ్‌గా మారుతుంది.అందుకే భాగస్వాములు ఒకరికొకరు సర్ప్రైజ్‌లు.. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా, ప్రేమ మరింత బలపడి.. సంబంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు.

భాగస్వామిని లేదా సంబంధాన్ని తేలికగా తీసుకోవడం: చాలా మందికి తమ భాగస్వామి లేదా వారి సంబంధాన్ని తేలికగా తీసుకోవడం అలవాటుగా మారుతుంది.. ఇలా చేయడం వల్ల వారి మధ్య దూరం రావడం ప్రారంభమవుతుంది. అందువల్ల, మీ సంబంధం కూడా ఇలాగే ఉంటే, మీరు మీ భాగస్వామి లేదా సంబంధాన్ని తేలికగా తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే అది సంబంధాన్ని మరింత పాడు చేస్తుంది.





























