మఖానా తినేటప్పుడు ఈ పొరబాట్లు చేశారో.. బండి షెడ్డుకే!
23 March 2025
TV9 Telugu
TV9 Telugu
తామర గింజలనే 'మఖానా' అంటారు. వీటిని ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. గ్లూటెన్ ఫ్రీతో పాటు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
మఖానా బరువుకి తేలికగా ఉంటాయేగానీ ఇది చాలా శక్తివంతమైన ఆహారం. ఎందుకంటే ఇది అనేక పోషకాలతో నిండిన అద్భుత నిధి
TV9 Telugu
మఖానాలో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఐరన్, జింక్, థయామిన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
మఖానా తినడం వల్ల ఎముకలు బలపడటమే కాకుండా.. కండరాలు బలపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నించే వారికి ఇది మంచి ఎంపిక
TV9 Telugu
మఖానా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. కాబట్టి దీనిని ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. కానీ దీనిని తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకుంటే ఇది ఆరోగ్యానికి మేలు బదులు హాని కలిగిస్తుంది
TV9 Telugu
చాలా మంది మఖానాను క్రంచ్‌గా ఉంటుందని వేయించి తింతుంటారు. కానీ మఖానాను నూనెలో లేదా ఎక్కువ మసాలా దినుసులతో వేయించకూడదు
TV9 Telugu
ఇతర ఆహారాల మాదిరిగానే మఖానాను కూడా పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. మఖానా గింజలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వస్తుంది
TV9 Telugu
అయితే మీ ఆహారంలో మఖానాను చేర్చుకుంటే మాత్రం పుష్కలంగా నీరు తాగడం మర్చిపోకండి. లేకుంటే మలబద్ధకంతో బాధపడతారు. మఖానా జీర్ణక్రియకు మంచిదే కానీ ఇది అధిక నీటిని గ్రహిస్తుంది. కాబట్టి ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉండాలి