- Telugu News Photo Gallery Healthy Drinks for Skin care: These five herbal and healthy drink can remove pimples on face add them in skin care routine
Skin Care Tips: మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ డ్రింక్స్ తాగితే శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..
Healthy Drinks: చర్మ సంరక్షణ కోసం హోం రెమెడీస్ తీసుకోవడం ఉత్తమం. ఈ చిట్కాలలో ఆరోగ్యకరమైన పానీయాలు కూడా ఉన్నాయి. ఈ పానీయాలు తాగడం వల్ల ముఖం మెరిసిపోవడంతోపాటు.. చర్మ సమస్యలు దూరమవుతాయి. అలాంటి 5 ఆరోగ్యకరమైన పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని తీసకోవడం వల్ల తక్కువ సమయంలో ముఖం నుంచి మొటిమలను పూర్తిగా తొలిగిపోతాయి.
Updated on: Mar 12, 2022 | 9:58 PM

ఉసిరి: శరీరాన్ని డిటాక్సిఫై చేసే ఉసిరి రసంతో చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని రుచి కొంచెం వికారంగా అనిపిస్తుంది. కానీ మంచిది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉసిరి రసాన్ని కలపి తాగాలి. ఇది మొటిమలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

పచ్చి వెల్లుల్లి పానీయం: ఇందులో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మొటిమలను తొలగించడానికి దీనితో తయారు చేసిన టీని కూడా తాగవచ్చు. ఇది జుట్టు దృఢత్వాన్ని కూడా పెంచుతుంది.

గ్రీన్ టీ: అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న గ్రీన్ టీ.. చర్మ సంరక్షణలో కూడా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మీరు దీన్ని రోజూ పరిమిత పరిమాణంలో తీసుకుంటే, మీ ముఖం మీద మొటిమలు ఒక వారంలో తొలగిపోతాయి.

పండ్ల రసం: క్యారెట్, దానిమ్మ, బీట్‌రూట్‌లను జ్యూస్‌గా చేసి వారానికి మూడుసార్లు తాగాలి. మొటిమలు దూరం చేయడంతోపాటు ఇది ముఖంపైనున్న ముడతలు, పిగ్మెంటేషన్‌ను నివారిస్తుంది. విశేషమేమిటంటే దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

వేప ఆకుల రసం: పురాతన కాలం నుంచి వేప ఆకులను తింటారు. వీటిలో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. దీని రసం చేయడానికి ముందుగా ఆకులను కడిగి మిక్సీలో వేసి అరగ్లాసు నీటిని జ్యూస్‌లా తయారు చేయాలి. ఆ తర్వాత వడగట్టి తాగాలి.

మొటిమలు పోవాలంటే ఈ హెల్తీ డ్రింక్స్ తాగండి




