- Telugu News Photo Gallery Healthiest Cooking Oils for Lowering Cholesterol and Good for heart Telugu Health news
LDL Cholesterol: ఈ ఆహారాలు, వంటచేసే పద్దతులే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.. తస్మాత్ జాగ్రత్త..!
వేయించిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. కేలరీల వినియోగం ఎక్కవగా అవుతుంది. అలాగే మీ శరీరంలో రోజు రోజుకు కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే తినడం, త్రాగటంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. కానీ నూనె లేకుండా వంట సాధ్యమేనా..? అంటే అందుకు బదులుగా కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయని నూనెలను ఎంచుకోండి.
Updated on: Dec 14, 2022 | 9:47 PM

రిఫైన్డ్ ఆయిల్ కొలెస్ట్రాల్ రోగులకు ఎప్పుడూ ఉపయోగపడదు. కొలెస్ట్రాల్ రోగులు రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కొబ్బరి నూనె వంటి నూనెలకు దూరంగా ఉండాలి. ఇది గుండె జబ్బుల సమస్యను పెంచుతుంది.

నిజానికి ఈ నూనెలు అధిక ఉష్ణోగ్రత వద్ద శుద్ధి చేయబడతాయి. ఇది నూనెలోని ముఖ్యమైన పోషకాలను నాశనం చేస్తుంది. బదులుగా ఇది కొవ్వు స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, ఈ రకమైన నూనెతో చేసిన ఆహారాలు LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచుతాయి.

ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొలెస్ట్రాల్ రోగులకు చాలా ఆరోగ్యకరమైనవి. ఈ రకమైన నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, బహుళఅసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, వాల్‌నట్ ఆయిల్, అవకాడో ఆయిల్ వంటి నూనెలు హెచ్‌డిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

మీరు కొలెస్ట్రాల్ పేషెంట్ అయితే, మీరు ఎంత నూనె వాడుతున్నారో అని తెలుసుకోవటం ముఖ్యం. తక్కువ నూనెతో వండటానికి ప్రయత్నించండి. ఇది శరీరంపై పెద్దగా ప్రభావం చూపదు.




