AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health: ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చునే పని చేసుకుంటున్నారా? త్వరలో మీకు మతిమరుపుతోపాటు

ప్రతిరోజూ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ ప్రభావం మెదడు ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. చాలా మంది ఉద్యోగాలు చేసేవారు కంప్యూటర్ గంటల ముందు తరబడి కూర్చుని పనిచేస్తుంటారు. రోజుకు 9 నుంచి 10 గంటలు కుర్చీలో పని చేయడం వల్ల వెన్నునొప్పి, భుజం నొప్పి, తుంటి నొప్పి మొదలైన సమస్యలు తలెత్తుతాయి. యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ డా శివరామ్‌రావు ఏం చెబుతున్నారంటే..

Srilakshmi C
|

Updated on: Oct 19, 2023 | 8:34 PM

Share

1 / 5
Health Tips 4ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది అభిజ్ఞా పనితీరును బలహీనపరుస్తుంది. నరాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమలో మార్పు వస్తుంది. ఇది మెడ, వెన్నునొప్పికి దారి తీస్తుంది. రోజంతా ఒకే చోట కూర్చోవడం వల్ల అభిజ్ఞా సమస్యలు, డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

2 / 5
ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల ఏకాగ్రత, పనులపై దృష్టి పెట్టడం కష్టతరం అవుతుంది. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. కదలకుండా కూర్చోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మూడ్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అదేపనిగా కూర్చోవడం వల్ల మెదడులో సమాచార ప్రక్రియ మందగిస్తుంది.

3 / 5
దీనివల్ల త్వరగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. మెదడు ప్లాస్టిసిటీని నిర్వహించడానికి శారీరక శ్రమ చాలా అవసరం. అనిశ్చల జీవనశైలి ఈ ప్లాస్టిసిటీని తగ్గిస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

4 / 5
ఇది స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి తరచుగా విరామం తీసుకోవడం, కూర్చున్న భంగిమను మార్చడం, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం వంటి పనులు చేయాలి.

5 / 5