- Telugu News Photo Gallery Sweet Potatoes: Eating too much of Sweet Potatoes can also cause some side effects
Sweet Potatoes: ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్
స్వీట్ పొటాటో లేదా గనిసిగడ్డ లేదా చిలకడ దుంప అందరికీ ఇష్టమైన కూరగాయ. వీటిని ఉడకబెట్టి తినవచ్చు, సాంబారులో కూడా వేసుకుని తినవచ్చు. వీటిల్లో విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల చర్మం, గుండెతోపాటు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. స్టార్చ్, పీచు, ప్రొటీన్, మాంగనీస్, కాపర్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ పోషకాలు స్వీట్ పొటాటో..
Updated on: Oct 19, 2023 | 8:20 PM

స్వీట్ పొటాటో లేదా గనిసిగడ్డ లేదా చిలకడ దుంప అందరికీ ఇష్టమైన కూరగాయ. వీటిని ఉడకబెట్టి తినవచ్చు, సాంబారులో కూడా వేసుకుని తినవచ్చు. వీటిల్లో విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల చర్మం, గుండెతోపాటు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. స్టార్చ్, పీచు, ప్రొటీన్, మాంగనీస్, కాపర్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ పోషకాలు స్వీట్ పొటాటో ఉంటాయి.

స్వీట్ పొటాటోలు గోధుమ లేదా బియ్యం కంటే అధిక స్థాయిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ప్రో-విటమిన్ A, విటమిన్ సి, ఖనిజాలను అందిస్తాయి. స్వీట్ పొటాటో ఫైబర్-రిచ్ ఫుడ్. శరీరానికి అవసరమైన విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, సోడియం, జింక్, మెగ్నీషియం తదితర పోషకాలను అందిస్తుంది. స్వీట్ పొటాటోలో సహజమైన చక్కెర కంటెంట్ ఉంటుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. చిలగడదుంపలో ఫోలిక్ యాసిడ్‌తో పాటు విటమిన్ బి గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది. స్వీట్ పొటాటో తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్తమా సమస్య తీరుతుంది. మలబద్ధకం పరిష్కారమవుతుంది. స్వీట్ పొటాటోలోని విటమిన్ సి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

స్వీట్ పొటాటోలో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా-కెరోటిన్ విటమిన్ ఎగా మారుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకం. విటమిన్ ఎ చర్మ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొత్త చర్మ కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా పొడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. శీతాకాలపు ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవడం వల్ల మీ చర్మం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

స్వీట్ పొటాటో ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. స్వీట్ పొటాటో అధికంగా తింటే చర్మంపై దద్దుర్లు, తలనొప్పికి కారణమవుతుంది. స్వీట్ పొటాటోలో ఆక్సలేట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. స్వీట్ పొటాటో గ్యాస్ట్రిటిస్‌కు కారణమవుతాయి. స్వీట్ పొటాటో తినడం వల్ల చర్మం, గోర్లు కొద్దిగా నారింజ రంగులో కనిపిస్తాయి.




