- Telugu News Photo Gallery Health Tips: Papaya To Kiwi Fruit, Best Fruits To Eat While Fasting in Festivals
Navaratri Fasting Tips: ఉపవాస సమయంలో ఏయే పండ్లు తినాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
చాలా మంది పండుగ సమయాల్లో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటారు. సాంప్రదాయ ఆయుర్వేద యోగ సూత్రాలలో సాత్విక ఆహారం స్వచ్ఛమైన, సరళమైన ఆహారంగా పరిగణించబడుతుంది. ఉపవాసం ఉన్న సమయంలో పండ్లు తినడం వల్ల రోజంతా శరీరంలో శక్తి కోల్పోకుండా ఉంటారు. తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ..
Updated on: Oct 18, 2023 | 8:38 PM

చాలా మంది పండుగ సమయాల్లో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటారు. సాంప్రదాయ ఆయుర్వేద యోగ సూత్రాలలో సాత్విక ఆహారం స్వచ్ఛమైన, సరళమైన ఆహారంగా పరిగణించబడుతుంది.

ఉపవాసం ఉన్న సమయంలో పండ్లు తినడం వల్ల రోజంతా శరీరంలో శక్తి కోల్పోకుండా ఉంటారు. తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఏయే విధమైన పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదనే విషయం చాలా మందికి తెలియదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

యాపిల్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, సి సమృద్ధిగా ఉండటం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తాయి. వాటిల్లోని ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది.

అరటిపండు ఉపవాస సమయంలో తినడానికి ఉత్తమమైన పండు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి పోషకాలు అధిరంగా ఉంటాయి. అలాగే కివీ పండ్లలో విటమిన్లు, మినరల్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఉపవాస సమయంలో మీ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహిస్తుంది.

బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, మల్బెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.




