Diabetes Health Tips: ఈ ఆకులను అంత తక్కువగా అంచనా వేయకండి.. మధుమేహానికి దివ్యౌషధం..!
అంజీర, దీనినే అత్తిపండ్లు అని కూడా అంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర పండుగా, డ్రైఫ్రూట్‌గా కూడా తీసుకోవచ్చు. అయితే అత్తి పండ్లతో పాటు దాని ఆకులు కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తుందని మీకు తెలుసా. అత్తి ఆకులను నీళ్లలో వేసి మరిగించి టీ తయారు చేసుకుని తీసుకుంటే..అనేక వ్యాధుల చికిత్సలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంజీర ఆకుల్లోని పోషకాలు, ఎలా వాడితే ఎలాంటి లాభాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 22, 2025 | 3:55 PM

అంజీర ఆకుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలపరుస్తుంది. మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే అంజీర టీ మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇది ఎముకలతో పాటు దంతాలను కూడా బలపరుస్తుంది. అంజీర ఆకులలో యాంటీఆక్సిడెంట్లు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. కానీ, ఇది క్యాన్సర్‌కు మందు కాదని గుర్తుంచుకోండి. మీరు దీన్ని రోజూ తాగితే కొంతవరకు దాని నుండి మిమ్మల్ని రక్షించవచ్చు.

అంజీర్ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మంచి పరిమాణంలో ఉంటాయి. అందువల్ల అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అంజీర్ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మంచి పరిమాణంలో ఉంటాయి. అందువల్ల అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అంజీర్ ఆకులను టీగా ఉపయోగించవచ్చు. ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర్ ఆకులతో టీ తయారు చేయడానికి ముందుగా అంజీర్ ఆకులను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటిని కావాల్సినన్నీ నీళ్లు తీసుకుని 10-15 నిమిషాలు మరిగించాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా చల్లర్చుకుని ఫిల్టర్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది.

అంజీర్ ఆకుల్లో అత్తి పండ్లలాగే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులలో విటమిన్లు, ఖనిజాలు మంచి మొత్తంలో ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అత్తి ఆకుల నుండి ఈ పోషకాలను పొందడానికి, ఆకులతో తయారు చేసిన టీ బెస్ట్ రెమిడీ. అంజీర్ ఆకుల టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.





























