Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీట్‌రూట్‌ ఆకులు పడేస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆకు కూరలు తినడం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా బీట్‌రూట్‌ ఆకుల్ని తినటం వల్ల కలిగే లాభాల గురించి విన్నారా..? అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 03, 2025 | 2:10 PM

Share
బీట్‌రూట్‌ మాదిరిగానే బీట్‌రూట్‌ ఆకుల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ఐరన్‌ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

1 / 5
బీట్‌రూట్‌ ఆకుల్లో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌ ఆకులు తింటే గట్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణ సమస్యలు రావు. 
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఫెర్టిలిటీ రేటు పెరుగుతుంది. ఇందులోని ఫోలేట్‌ శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది.

బీట్‌రూట్‌ ఆకుల్లో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌ ఆకులు తింటే గట్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణ సమస్యలు రావు. బీట్‌రూట్‌ ఆకులు తింటే ఫెర్టిలిటీ రేటు పెరుగుతుంది. ఇందులోని ఫోలేట్‌ శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది.

2 / 5
బీట్‌రూట్‌ ఆకుల్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ను పెంచుతాయి. రక్తపోటును కంట్రోల్‌ చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ ఎ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3 / 5
బీట్‌రూట్‌ ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి అధిక మోతాదులో లభిస్తుంది. ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యవంతంగా మార్చుతాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్‌రూట్‌ ఆకులు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

4 / 5
బీట్‌రూట్‌ ఆకులు తింటే వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు.. బీట్‌రూట్‌ ఆకుల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్‌ అందిస్తుంది. ఫలితంగా తక్కువ తింటారు. దీంతో బరువు తగ్గొచ్చు. సూప్స్‌, సలాడ్స్‌ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

5 / 5