- Telugu News Photo Gallery Health Benefits Of Consuming Mustard And Mustard Oil Telugu Lifestyle News
Mustard Health Benefits: ఈ చిట్టి ఆవాలతో పుట్టేడు లాభాలు.. ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో తెలుసా..?
ప్రతి వంటింట్లో తప్పక ఉండే మసాలా దినుసుల్లో ఆవాలు ఒకటి. ఇవి తాళింపుల్లో తప్పనిసరిగా పడాల్సిందే. ఆవాలు వేయనిదే ఎలాంటి పోపు పూర్తి కాదు..అలాగే ఆవాల నుండి తీసిన నూనె కూడా చాలా మంది వంటలకు ఉపయోగిస్తారు. ఆవా నూనె కేవలం వంటకు మాత్రమే కాదు..ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఆవాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆవాలను అలాగే ఆవ నూనెను వాడి మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 23, 2024 | 9:05 PM

ఈ రసాయనాలు మన శరీరంలో అలాగే ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా విడుదలైన రసాయనాలను విచ్ఛినం చేసి మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పొడిని వేడి నీటిలో వేసి కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ జాజికాయను రోజుకు 15 లేదా 16 గ్రాముల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదని వారు చెబుతున్నారు. ఈ మోతాదుకు మించి ఉపయోగిస్తే మేలు చేసే జాజికాయ కీడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా జాజికాయను నీటితో అరగదీయాలి.

వేయించిన ఆవాల పిండితో నీళ్ల విరేచనాలకు చికిత్స చేయవచ్చు. ఇందుకోసం దోరగా వేయించిన ఆవాలను, బెల్లాన్ని సమానంగా తీసుకుని మెత్తగా దంచుకున్న మిశ్రమాన్ని బఠాణీ గింజలంత మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా తీసుకుంటే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి.

బోదకాలును హరించే గుణం కూడా ఆవాలకు ఉంది. ఆవాలు, ఉమ్మెత్తాకులు, ఆముదపు చెట్టు వేర్లు, మునగ చెట్టు బెరడు.. వీటన్నింటిని సమానంగా తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని బోదకాలు వాపులపై రాసి కట్టు కడితే క్రమంగా వాపులు తగ్గుతాయి. ఆవాలను మంచి నీటితో కలిపి మెత్తగా నూరుకుని ముక్కు దగ్గర వాసన తగిలేటట్టు ఉంచితే మూర్ఛ వల్ల స్పృహ కోల్పోయిన వారికి వెంటనే మెలుకువ వస్తుంది.

ఆవ నూనెతో చెవుల్లోంచి చీము కారే సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. అందుకోసం ఆవనూనె 50 గ్రాములు, నల్ల తుమ్మ చెట్టు పూలు 20 గ్రాములు మోతాదులో తీసుకోవాలి. ఆవనూనెలో ఈ పూలను వేసి చిన్న మంటపై పూలు నల్లగా అయ్యే వరకు వేడి చేసి వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజుకూ రెండు పూటలా మూడు నుండి నాలుగు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవి నుండి చీము కారడం, చెవి పోటు, చెవిలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

అలాగే, ఆవాలను దోరగా వేయించి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని అర గ్రాము మోతాదులో అర కప్పు పెరుగులో కలిపి ఉదయాన్నే తినిపిస్తే ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల పిల్లల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. పిల్లలు పళ్లు కొరకుండా ఉంటారు.




