- Telugu News Photo Gallery Cinema photos Nag Ashwin got a chance to make a Kalki 2898 film much better because of the election
Nag Ashwin: ఇండస్ట్రీలోకి మరో జక్కన్న.. కల్కికి మరింత మెరుగు పెడుతున్న నాగ్..
తెలుగు ఇండస్ట్రీలో చెక్కడం అనే పదం వినిపిస్తే ముందుగా గుర్తుకొచ్చేది రాజమౌళి. ఏళ్ళకేళ్లు తన సినిమాలను చెక్కుతుంటారీయన. అందుకే జక్కన్న అనే పేరే వచ్చేసింది ఈయనకు. తాజాగా మరో జక్కన్న టాలీవుడ్‌లో కనిపిస్తున్నారు. పైగా ఎన్నికల కారణంగా తన సినిమాను మరింత చెక్కే అవకాశం వచ్చింది ఆ దర్శకుడికి. ఇంతకీ ఎవరా కొత్త జక్కన్న..?
Updated on: Mar 24, 2024 | 7:02 AM

అద్భుతం జరిగేటప్పుడు గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన పనిలేదంటూ త్రివిక్రమ్ ఓ సినిమాలో రాసారు. నాగ్ అశ్విన్‌ను చూస్తుంటే అదే అనిపిస్తుందిప్పుడు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి లాంటి సినిమాల తర్వాత కల్కి అంటూ ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారీయన. అదేంటని అడిగితే.. తెలుగు సినిమా రేంజ్ ప్రపంచానికి చూపిస్తానంటున్నారు.

ఐదేళ్లుగా కల్కి కోసమే కష్టపడుతున్నారు నాగ్ అశ్విన్. మహాభారతంతో మొదలై.. భవిష్యత్తులో 2898 సంవత్సరంతో కథ ముగుస్తుంది. 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తున్నారు నాగ్ అశ్విన్. అందుకే దీని టైటిల్ కల్కి 2898 AD అని పెట్టారు.

భారతీయ ఇతిహాసాల చుట్టూనే కథ అల్లుకున్నారు దర్శకుడు. అశ్వద్ధామతో పాటు విష్ణు అంశ కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. కల్కి షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మే 9న విడుదల తేదీ ఉండటంతో.. ఓ టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నారు టీం.

ఎట్టి పరిస్థితుల్లో మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఎన్నికలు మే 13న ఉండటంతో రిలీజ్ డేట్ మార్చుకోక తప్పేలా లేదిప్పుడు. ఎలాగూ టైమ్ దొరికింది కదా అని.. కల్కికి మరింత మెరుగు పెడుతున్నారు నాగ్ అశ్విన్. రిలీజ్ డేట్ లాక్ అయిపోవడంతో ఇన్నాళ్లూ ఫాస్టుగా పని చేసిన టీం.. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు.

కావాల్సినంత టైమ్ తీసుకుని క్వాలిటీ ఔట్ పుట్ ప్లాన్ చేస్తున్నారు. మహానటితోనే నాగ్ అశ్విన్ సత్తా తెలిసింది. ఇక ఇప్పుడు కల్కితో హాలీవుడ్ రేంజ్‌లో తన టాలెంట్ చూపించాలనుకుంటున్నారు ఈ కుర్ర దర్శకుడు. ఒకవేళ వాయిదా పడితే మాత్రం.. దాన్ని కూడా సినిమా చెక్కడానికే యూజ్ చేయనున్నారు ఈ దర్శకుడు.




