- Telugu News Photo Gallery Cinema photos Who will be the next Bond in the James Bond movie is a discussion on social media
James Bond: బాండ్ రోల్‌కు గుడ్ బై చెప్పిన క్రెగ్.. మరి నెక్స్ట్ బాండ్ ఎవరు.?
జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఇప్పటి వరకు 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎక్కువ సినిమాల్లో డానియల్ క్రెగ్ బాండ్‌గా కనిపించారు. కానీ నో టైమ్ టు డై తరువాత బాండ్ రోల్‌కు గుడ్ బై చెప్పేశారు క్రెగ్. దీంతో నెక్ట్స్ బాండ్ ఎవరన్న క్వశ్చన్‌ను అభిమానులను వేదిస్తోంది. తాజాగా ఈ విషయంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఆ కామెంట్స్ ఏంటి.? నెక్స్ట్ రాబోయే బాండ్ ఎవరు.? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 24, 2024 | 7:34 AM

నో టైమ్ టూ డై సినిమాలో ఇద్దరు కొత్త ఏజెంట్‌లను పరిచయం చేశారు. ఒక్కరు గ్లామర్ క్వీన్ పలోమా, మరొకరు యాక్షన్ స్టార్ నోమి. బాండ్‌కు హెల్స్ చేసిన ఈ ఇద్దరు ఏజెంట్స్‌లో ఒకరే నెక్ట్స్ బాండ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ అప్పట్లో హాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపించింది.

బాండ్ క్యారెక్టర్‌లో విమెన్ చేస్తే బాగుంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అందుకే ఈ సారి లేడీ బాండ్‌ను వెండితెర మీద చూపిస్తారని భావించారు. ఆ ప్లాన్‌తోనే 25th మూవీలో పలోమ క్యారెక్టర్‌ను పరిచయం చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో టెస్ట్ చేశారని ఎనలైజ్ చేశారు క్రిటిక్స్.

మరోవైపు బ్లాక్ బస్టర్ మూవీ సిరీస్ జేమ్స్ బాండ్ లో నెక్స్ట్ బాండ్ రోల్‌కు సంబంధించి కొంతారు హాలీవుడ్ టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. టామ్ హార్డీ, జాన్ బోయెగాలలో ఒకరు నెక్ట్స్ బాండ్‌గా కనిపించే ఛాన్స్ ఉందన్న న్యూస్ కూడా ట్రెండ్ అయ్యింది.

అదే సమయంలో ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్‌ను కూడా బాండ్ రోల్‌కు ఆడిషన్ ఇచ్చారన్న వార్తలు ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో కొత్త పేరు యాడ్ కూడా అయ్యింది. అదెవరు అని ఆలోచిస్తున్నారా.? ఎవరో మిరే చుడండి..

గాడ్జిల్లా, అవెంజర్స్ లాంటి యాక్షన్ సినిమాల్లో నటించిన ఆరోన్ టేలర్ జాన్సన్‌ను బాండ్ రోల్‌కు కన్సిడర్ చేస్తున్నారన్నది నయా అప్‌డేట్. ఏజ్, యాక్షన్ ఇమేజ్ పరంగా బాండ్ రోల్‌కు ఆరోన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ పేరైన ఫైనల్ అవుతుందేమో చూడాలి.




