Mahi V Raghava: రెండు చోట్ల సక్సెస్‌లు.. రేర్ ఫీట్‌ను అచ్చీవ్ చేసిన మహి వి రాఘవ..
సిల్వర్ స్క్రీన్ మీద, ఓటీటీలో రెండు ప్లాట్ ఫామ్స్‌లో ప్యారలల్‌గా ప్రాజెక్ట్స్ చేయటం. రెండు చోట్ల సక్సెస్‌లు సాధిచటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రేర్ ఫీట్‌ను ఈజీగా అచ్చీవ్ చేస్తున్నారు దర్శకుడు మహి వి రాఘవ. ముఖ్యంగా డిజిటల్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు ఈ దర్శకుడు. మరి ఈయన కొట్టిన ఆ హ్యాట్రిక్ హిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 24, 2024 | 7:51 AM

సిల్వర్ స్క్రీన్ మీద, ఓటీటీలో రెండు ప్లాట్ ఫామ్స్‌లో ప్యారలల్‌గా ప్రాజెక్ట్స్ చేయటం. రెండు చోట్ల సక్సెస్‌లు సాధిచటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రేర్ ఫీట్‌ను ఈజీగా అచ్చీవ్ చేస్తున్నారు దర్శకుడు మహి వి రాఘవ. ముఖ్యంగా డిజిటల్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు ఈ దర్శకుడు.

ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ్, తరువాత యాత్ర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన యాత్ర సక్సెస్ తరువాత డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద ఫోకస్ చేశారు ఈ డైరెక్టర్.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నారు మహి. డిజిటల్ రికార్డ్‌ల దుమ్ము దులిపిన ఈ షో తరువాత, పూర్తి కాంట్రాస్ట్‌గా బోల్డ్ కాన్సెప్ట్‌తో షైతాన్ సీజన్ 1ను రూపొందించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

రీసెంట్‌గా యాత్ర 2తో సిల్వర్ స్క్రీన్ మీద మరో డీసెంట్ హిట్ అందుకున్న మహి, ఓటీటీలోనూ అదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. సేవ్ ద టైగర్స్ సీజన్ 2తో మరో బిగ్ హిట్ సాధించారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ షోకు డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

థియేట్రికల్‌గా మంచి ఫామ్‌లో ఉంటూ ఓటీటీల మీద కూడా ఫోకస్ చేస్తున్న దర్శకులు సౌత్‌లో చాలా అరుదు. అందులోనూ డిజిటల్‌లో హ్యాట్రిక్ సాధించటం అంటే రేర్ రికార్డ్ అంటున్నారు విశ్లేషకులు.




