- Telugu News Photo Gallery Health Benefits Of Breakfast: Why Breakfast Is the Most Important Meal of the Day, Know the reasons
Morning Breakfast: ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే ఎంత బిజీగా ఉన్నా..
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఉదయం ఎంత పని ఉన్నాసరే బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం తీసుకునే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) మానేస్తే దాని ప్రభావం మొత్తం ఆరోగ్యంపై..
Updated on: Aug 22, 2022 | 11:17 AM

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఉదయం ఎంత పని ఉన్నాసరే బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం తీసుకునే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) మానేస్తే దాని ప్రభావం మొత్తం ఆరోగ్యంపై పడుతుంది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడంతోపాటు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి..

బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. తిన్న వెంటనే స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

ఉదయం నిద్రలేచిన రెండు గంటల్లోపు అల్పాహారం తీసుకోవాలి. అంటే ఉదయం 9 గంటలకు ముందే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.

చాలా మంది ఉదయం పూట తీసుకోవల్సిన బ్రేక్ ఫాస్ట్‌ను మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అధిక రక్తపోటు, షుగర్, ఇతర గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం)లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. పాలు, విత్తనాలు వంటి చేర్చుకుంటే మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.




