- Telugu News Photo Gallery Curcumin benefits: Why you should add turmeric to your diet: here's Reasons
Curcumin: పచ్చి పసుపు ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే ఎన్ని లాభాలో.. ఆ సమస్యలన్నీ పరార్!
ఆయుర్వేదంలో పచ్చి పసుపు ప్రాధ్యాన్యం అంతా ఇంతా కాదు. పసుపును వంటలో, సౌందర్య సాధనాలతోపాటు పూజా కార్యక్రమాల్లో కూడా ఉపయోగిస్తారు. పచ్చి పసుపులో కర్కుమిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక..
Updated on: Aug 22, 2022 | 11:42 AM

ఆయుర్వేదంలో పచ్చి పసుపు ప్రాధ్యాన్యం అంతా ఇంతా కాదు. పసుపును వంటలో, సౌందర్య సాధనాలతోపాటు పూజా కార్యక్రమాల్లో కూడా ఉపయోగిస్తారు. పచ్చి పసుపులో కర్కుమిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

పచ్చి పసుపులో యాంటీబయాటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే పచ్చి పసుపు, మిరియాలు, అల్లం కలిపి చూర్ణం చేసి తయారు చేసిన టీ తాగితే జలుబు, దగ్గు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందుతామని పెద్దలు చెబుతుంటారు. పచ్చి పసుపును రోజూ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.

పసుపు బరువును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో బాధపడేవారు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు కూడా దీన్ని తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. పచ్చి పసుపు, అల్లం గ్రైండ్ చేసి టీ తయారు చేసుకుని రోజూ ఉదయాన్నే తాగితే కొవ్వు త్వరగా కరిగిపోయి బెల్లీ ఫ్యాట్ తగ్గుముఖం పడుతుంది.

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమల సమస్యతో బాధపడే వారు పచ్చి పసుపు తింటే తీవ్రత తగ్గుతుంది.

పచ్చి పసుపు, తేనె, పంచదార కలిపి కళ్ల కింద రాసుకుంటే కళ్ల కింద రక్త ప్రసరణను ప్రేరేపించి నల్ల వలయాలను నివారిస్తుంది.

శరీర గాయాలను నయం చేయడంలో కూడా పసుపు సహాయపడుతుంది. పసుపును చూర్ణం చేసి, సాధారణ ఆలివ్ నూనెతో కలిపి నొప్పి, వాపు ఉన్న చోట పూస్తే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.




