కివిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కివిలోని పోషకాలు మచ్చలు, మొటిమల సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులోని ఎలక్ట్రోలైట్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒక వారం పాటు కివి తింటే మీ లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్) సాధారణ స్థాయికి తీసుకువస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.