గరు ఆదిత్య రాజయోగం వలన వీరికి డబ్బే డబ్బు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు ఆదిత్య రాజయోగం అనేది చాలా శక్తి వంతమైనది. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం,అలాగే ఇప్పటికే బృహస్పతి మిథున రాశి సంచార దశలో ఉన్నందున రెండు గ్రహాల కలయికతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీంతో ఐదు రాశుల వారి అత్యంత అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 07, 2025 | 6:06 PM

సింహ రాశి : సింహ రాశి వారికి గురు ఆదిత్య రాజయోగం వలన ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

కుంభ రాశి : గురు ఆదిత్య రాజయోగం వలన వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

మీన రాశి : మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం, అలాగే బృహస్పతి కలయికతో ఏర్పడే గురు ఆదిత్య రాజయోగం వలన మీన రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. మొడి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆదిత్య రాజయోగం వలన శుభ ఫలితాలే కలగనున్నాయి. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.

వృషభ రాశి : గురు ఆదిత్య రాజయోగం వలన వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.



















