New Year Resolution: కొత్తేడాదిలో ఈ కొత్త నిర్ణయాలు తీసుకోండి.. ఏడాదంతా ఆరోగ్యంగా ఉండండి..
New Year Resolution: కొత్త ఏడాది వచ్చిందంటే కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ నిర్ణయం మీ ఆరోగ్యాన్ని కాపాడేవి అయితే.. ఎంతో బాగుంటుంది కదూ.. మరి ఆరోగ్యాన్ని కాపాడే ఆ నిర్ణయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 31, 2021 | 10:12 AM

కొత్త ఏడాది మనలో కొందరు కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. వీటినే మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌గా చెబుతుంటాం. అయితే అన్నింటికంటే ముఖ్యమైన ఆరోగ్యం విషయంలో నిర్ణయాలు తీసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే ఈ కొత్తేడాది సంతోషంగా, ఆరోగ్యంగా గడవాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఆ రిజల్యూషన్స్ ఏంటంటే..

కరోనా సమయంలో కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ కొత్త ఏడాదిలో వ్యాయామం చేయడంపై అందరూ రిజల్యూషన్ తీసుకోవాలి. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని పెంచే వర్కవుట్స్‌పై దృష్టి పెట్టాలి.

సోషల్ మీడియా, విపరీతమైన స్మార్ట్ ఫోన్ వినియోగంతో చాలా మంది నిద్రకు దూరమవుతున్నారు. కాబట్టి ఈ ఏడాదిలో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మంచి నిద్రే మంచి ఆరోగ్యానికి కారణమనే విషయాన్ని మరిచిపోకూడదు.

అనేక అనోరగ్య సమస్యలకు సరిపడ నీరు తాగకపోవడమే కారణమని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి ఈ ఏడాది నీటిని తాగడాన్ని అందరూ ఒక అలవాటుగా మార్చుకోవాలి. గజిబిజీ జీవితంలో ఆరోగ్యానికి అధిక ప్రాధన్యత ఇవ్వాలి. శరీరంలో సరిపడ నీరు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని గుర్తుపెట్టుకోవాలి.

ఇక పని ఒత్తిడి, ఇతర కారణాలతో చాలా మంది భోజనాన్ని సమయానికి తీసుకోవడాన్ని పూర్తిగా మరిచిపోతున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి కొత్త ఏడాదిలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.





























