- Telugu News Photo Gallery Cricket photos IND VS SA 1st test match Records: India 1st Test Win In South Africa Centurion ground
IND vs SA: 8వ విజయంతో అగ్రస్థానం చేరిన కోహ్లీసేన.. భారత టెస్ట్ సారథి వెరీ వెరీ స్పెషల్ రికార్డు ఏంటో తెలుసా?
ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు విరాట్ కోహ్లి అండ్ కంపెనీ ఎన్నో భారీ రికార్డులను బ్రేక్ చేసింది. భారత జట్టు పాకిస్థాన్ నెలకొల్పిన ఓ రికార్డును కొల్లగొట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది.
Venkata Chari | Edited By: Anil kumar poka
Updated on: Dec 31, 2021 | 8:22 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ ఏడాది అత్యంత విజయవంతమైన టెస్టు జట్టుగా టీమిండియా నిలిచింది. 2021లో 8వ టెస్టు విజయాన్ని అందుకోవడంతో ఈ స్పెషల్ రికార్డు సాధ్యమైంది. ఈ టెస్టుకు ముందు పాకిస్థాన్‌తో కలిపి 7 మ్యాచ్‌ల్లో గెలిచి సమంగా నిలిచింది. తరువాతి స్థానంలో నాలుగు విజయాలతో ఇంగ్లండ్ నిలిచింది.

భారత టెస్ట సారథి విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. దక్షిణాప్రికాలో ఇప్పటివరకు మొత్తం 4 టెస్టు మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించిన విరాట్, రెండింట్లో విజయాలు సాధించాడు.

రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో 2006లో సౌతాఫ్రికాలో ఒక టెస్టు, 2010లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలో టీమ్ ఇండియా ఒక టెస్టు గెలిచింది. వరుసగా రెండు బాక్సింగ్ డే టెస్టులు గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా భారత టెస్ట్ సారథిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

అదే సమయంలో దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియాకు ఇది నాలుగో విజయం. దీంతో సౌతాఫ్రికాలో నాలుగు టెస్టులు గెలిచిన తొలి ఆసియా దేశంగా టీమిండియా రికార్డు నెలకొల్పింది.

ఐసీసీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 64.28 విజయాల శాతంతో 54 పాయింట్లతో డబ్యూటీసీలో టీమ్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా టీం పాయింట్లు లేకుండా 8వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 100 విజయ శాతం, 36 పాయింట్లతో అగ్రస్థానం చేరుకుంది.





























