- Telugu News Photo Gallery Follow these best health care tips to control blood sugar level or diabetes in Telugu
Diabetes Control Tips: రక్తంలో బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే.. వీటిని మీ జీవనశైలిలో భాగం చేసుకోవాల్సిందే..
Diabetes control tips: మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తుండాలి. అదేవిధంగా కొన్ని ఆహార పద్ధతులు, అలవాట్లు క్రమం తప్పకుండా పాటించాలి
Updated on: Apr 20, 2022 | 9:59 AM

కాకర కాయ రసం: ఇది రుచిలో చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే ఉదర సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి మధుమేహ రోగులు రోజూ ఒక గ్లాసు కాకర కాయ జ్యూస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నేరేడు పండ్లు (జామున్): మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, గుణాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. వీటి గింజలను ఎండబెట్టి, పొడిని తయారు చేసి, ఆపై నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితముంటుంది.

సమయానికి అల్పాహారం తీసుకోని లేదా మానేసిన వారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే షుగర్ ఉన్నా లేకపోయినా సమయానికి బ్రేకఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి.

మధుమేహం నియంత్రణలో ఉండాలంటే చికిత్సతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో ముఖ్యం.

ప్రస్తుతమున్న యాంత్రిక జీవనం కారణంగా వృద్ధులతో పాటు యువత కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఇది వచ్చిన చాలా రోజులకు కానీ బాధితులకు తెలియడం లేదు. అందుకే కొన్ని అలవాట్లు పాటించడం ద్వారా ఈ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అదేవిధంగా నిపుణులు సూచించిన పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.




