- Telugu News Photo Gallery Flight Rules for Child Passengers know what is minimum age for solo flight trip and minimum age
Flight Rules for Child: విమానంలో ఒంటరిగా ప్రయాణించాలంటే.. పిల్లలకు ఎంత వయస్సు ఉండాలో తెలుసా..?
పిల్లలు విమానంలో ఒంటరిగా ప్రయాణించడానికి సంబంధించి విమానయాన సంస్థలు పలు మార్గదర్శకాలను రూపొందించాయి. అవేంటో తెలుసుకోండి
Updated on: May 12, 2022 | 12:18 PM

Flight Rules for Child: అన్ని వర్గాల వ్యకులు విమానాల్లో ప్రయాణించడాన్ని మనం తప్పక చూసుంటాం.. వారి వెంట పిల్లలు కూడా ప్రయాణిస్తుంటారు. అయితే విమానంలో ప్రయాణించడానికి పిల్లల కోసం ప్రత్యేక నియమాలు, నిబంధనలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే తెలుసుకోండి.. చిన్న పిల్లల ప్రయాణానికి సంబంధించి విమానయాన సంస్థలు అనేక మార్గదర్శకాలను రూపొందించాయి. ముఖ్యంగా చిన్నారుల వయస్సు, ఒంటరిగా వారు ఎప్పుడు ప్రయాణించవచ్చు..? అనే నియమాలు ఉన్నాయి. విమానంలో ప్రయాణించాలంటే.. పిల్లలకు సంబంధించిన నియమాలు ఏమిటో తెలుసుకోండి.

విమానంలో ఒంటరిగా ప్రయాణించాలంటే.. చిన్నారులకు ఎంత వయస్సు ఉండాలి.. విమానంలో ఒంటరిగా ప్రయాణించడం గురించి మాట్లాడుకుంటే.. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు విమానంలో ఒంటరిగా ప్రయాణించవచ్చు. ఇందులో ప్రతి విమానయాన సంస్థకు దాని సొంత నియమాలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం.. పిల్లలు విమానంలో ప్రయాణించవచ్చు. కానీ పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు తప్పకుండా ఉండాలి.

ఒకవేళ పిల్లలకు ఒంటరిగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విమానంలో పంపాలనుకుంటే.. దీనిని సులభంగా చేయవచ్చు. ఇందుకోసం పలు విమానయాన సంస్థలు పిల్లల కోసం 'ఫ్లైయింగ్ సోలో' వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాయి.

పిల్లలు ప్రయాణించడానికి కనీసం ఎంత వయస్సు ఉండాలి..? 7 రోజుల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు.. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చైల్డ్ కేటగిరీలో ప్రయాణించవచ్చు. అయితే ఆ పిల్లలు తప్పనిసరిగా వయస్సు ధృవీకరణ పత్రాన్ని (జనన ధృవీకరణ పత్రం) కలిగి ఉండాలి. ఆసుపత్రి నుంచి తల్లి డిశ్చార్జ్, పాస్పోర్ట్ మొదలైనవి చూపించాలి.

పిల్లలకు ప్రత్యేక సీట్లు బుక్ చేసుకోవచ్చా..? శిశువుల విభాగంలో పిల్లలకు ప్రత్యేక సీటు లభించదన్న విషయాన్ని తెలుసుకోవాలి. శిశువులు, చిన్నారులు ప్రత్యేక సీటులో ప్రయాణించలేరు. పెద్దల ఒడిలో మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. ఎయిర్‌బస్ A 320లో గరిష్టంగా 12 మంది, ATRలో గరిష్టంగా ఆరుగురు పిల్లలు ప్రయాణించవచ్చు.




