Prayagraj: ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రధానమంత్రి మంత్రులగా ఐదుగురు.. వారెవరు.?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన పురాతన పట్టణం ప్రయాగ్‌రాజ్‌ని ప్రధానమంత్రి నగరం అంటారు. వాస్తవానికి, ప్రయాగ్‌రాజ్ ప్రాంతం నుంచి భారతదేశానికి మొత్తం ఐదుగురు ప్రధానమంత్రులుగా సేవలు అందించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్ నగరాన్ని ప్రధానమంత్రి నగరంగా పిలవడానికి ఇదే బలమైన కారణం. మరి ఇంకో కారణం ఏమి లేదు.
Updated on: Jun 13, 2025 | 8:00 PM

ప్రయాగ్‌రాజ్ నగరం స్వతంత్ర పోరాట నాయకుడు, దేశ తొలి ప్రధానిగా సేవలు అందించిన జవహర్‌లాల్ నెహ్రూ జన్మస్థలం. 15 ఆగస్టు 1947 నుంచి వరుసగా 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ ప్రక్రియలో నాలుగు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. ఆయన పదవీకాలం మే 1964లో ఆయన మరణంతో ముగిసింది.

లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి మూడవ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. ఆయన 1964 నుండి 1966 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. గతంలో ఆయన 1961 నుండి 1963 వరకు హోంమంత్రిగా పనిచేశారు.

నెహ్రు కుమార్తె, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా పని చేసిన ఇందిరా గాంధీ కూడా ప్రయాగ్‌రాజ్‌లోనే జన్మించారు. 15 సంవత్సరాల 350 రోజుల పదవీకాలంతో, ఆమె తండ్రి తర్వాత అత్యధిక కాలం భారత ప్రధానమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా నిలిచారు. 1966 నుండి 1977 వరకు, మళ్ళీ 1980 నుండి 1984లో ఆమె హత్యకు గురయ్యే వరకు.

తర్వాత ఇందిరా గాంధీ కుమారుడు, దేశనికి 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. ఆయన 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1984లో ఆయన తల్లి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తర్వాత ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

భారతదేశనికి 7వ ప్రధానమంత్రిగా సేవలు అందించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జన్మస్థలం కూడా ప్రయాగ్‌రాజ్ నగరం. 1989 నుండి 1990 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. ఒక్క సంవత్సరం మాత్రమే ఈ పదవిలో ఉన్నారు.




