- Telugu News Photo Gallery Fiber Rich Food: These Fiber Rich Vegetables Help To Overcome Constipation Problem
Fiber Rich Food: ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు ఇవే.. మందులు అవసరం లేదు ఇవి తింటే చాలు!
మలబద్ధకంతో బాధపడేవారు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే టాయిలెట్‌కి వెళ్లే సమయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా కొన్ని తాజా కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజు వారీ ఆహారంలో తినడం ద్వారా ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.బ్రోకలీ ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ. ఈ కూరగాయ జీర్ణక్రియకు..
Updated on: May 26, 2024 | 1:21 PM

మలబద్ధకంతో బాధపడేవారు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే టాయిలెట్‌కి వెళ్లే సమయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా కొన్ని తాజా కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజు వారీ ఆహారంలో తినడం ద్వారా ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.బ్రోకలీ ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ. ఈ కూరగాయ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

క్యారెట్‌లో వివిధ విటమిన్‌లతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

పాలకూర మలబద్దకానికి కూడా చాలా మేలు చేస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడటమే కాకుండా, ఈ ఆకు కూర జీర్ణ సమస్యలను కూడా సులువుగ తొలగిస్తుంది. అలాగే స్వీట్ పొటాటోలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్స్ అన్నీ మలాన్ని మృదువుగా చేస్తాయి. ఫలితంగా మలవిసర్జన ప్రశాంతంగా జరుగుతుంది.

బీన్స్‌లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. అయితే ఇవి శీతాకాలంలో మాత్రమే మార్కెట్‌లో దొరుకుతాయి. చలికాలంలో దీన్ని ఎక్కువగా తినాలి.

దుంపల్లో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బీట్‌రూట్ దుంపలోని అనేక పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని ఆహారంలో తినడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.




