భోజనం చేసిన తర్వాత చాలా మందికి సోంపు గింజలు తినడం అలవాటు. మరికొందరు ఉదయం పూట ఖాళీ కడుపుతో సోంపు నానబెట్టిన నీటిని తాగుతుంటారు. అయితే సోంపు ఎలా తిన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డిటాక్స్ వాటర్‌గా సోంపు గింజలు నానబెట్టిన నీళ్లు మేలు చేస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి కూడా సోంపు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు సోంపు ఉపశమనం కలిగిస్తుంది.