Essential Oils: ఇలా చేశారంటే మీ ఇల్లు తాజా సువాసనలతో నిండిపోతుంది..
అరోమాథెరపీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విధానంలో ఎసెన్షియల్ ఆయిల్స్‌తో వైద్యం చేస్తారు. శారీరక ఆరోగ్యంతోపాటు, సౌందర్య పోషణకు, మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరచడంలోనూ ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో ఉపయోగపడతాయి..
Updated on: Oct 26, 2022 | 12:42 PM

అరోమాథెరపీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విధానంలో ఎసెన్షియల్ ఆయిల్స్‌తో వైద్యం చేస్తారు. శారీరక ఆరోగ్యంతోపాటు, సౌందర్య పోషణకు, మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరచడంలోనూ ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో ఉపయోగపడతాయి.

ఇంటిని ప్రతిరోజూ తాజాగా పూలతో అలంకరించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో తాజాదనాన్ని ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్‌లో ముంచిన కొవ్వొత్తి లేదా కాటన్ బాల్ (దూది) గదిలో ఉంచితే రూమ్ ఫ్రెషనర్లుగా, కమ్మని సువాసనలు వెదజల్లుతాయి.

బాత్‌రూమ్‌లో ఎసెన్షియల్ ఆయిల్ బాటిల్‌ను ఉంచడం వల్ల, ఆ సువాసన హాయిగా అనిపిస్తుంది.

దుస్తుల్లో సువాసన నింపడానికి నాఫ్తలీన్‌కు బదులుగా ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఒక చిన్న గాజు గిన్నెలో కొద్ది మొత్తంలోఎసెన్షియల్ ఆయిల్‌ను తీసుకొని అల్మారాలో ఒక మూలన ఉంచండి. ఐతే బట్టలపై పడకుండా జాగ్రత్తగా ఉంచడం మర్చిపోకూడదు.

షూ నుంచి దుర్వాసన వస్తోందా? బేకింగ్ సోడాలో రెండు-నాలుగు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి షూస్ లోపల వేసి, రాత్రంతా వదిలేయండి. మరుసటి రోజు బూట్లు ధరించే ముందు, శుభ్రం చేసి ధరించండి. బూట్ల వల్ల పాదాలపై దద్దుర్లు రావు.

కారులో పర్‌ఫ్యూమ్‌కు బదులు ఎసెన్షియల్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని.. కొన్ని చుక్కలు కారు డ్యాష్‌బోర్డ్‌పై వేయండి. కారులో ప్రయాణించేటప్పుడు చక్కని సువాసనలు వెదజల్లుతుంది.





























