- Telugu News Photo Gallery Eating strawberries can protect against many chronic diseases, Check Details in Telugu
Strawberries: ఈ చిన్న స్ట్రాబెర్రీలు.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి!
స్ట్రాబెర్రీలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి..
Updated on: Dec 13, 2024 | 5:51 PM

పండ్లలో చాలా మంది ఇష్టపడి తినే వాటిల్లో స్ట్రాబెర్రీలు కూడా ఒకటి. స్ట్రాబెర్రీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మందికి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఈ ఫ్రూట్ ఫ్లేవర్‌తో ఎన్నో ఫుడ్స్ కూడా తయారు చేస్తారు. స్ట్రాబెర్రీలు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

స్ట్రాబెర్రీల్లో కూడా ఉపయోగపడే పోషకాలు చాలానే ఉన్నాయి. చాలా మంది చర్మ అందాన్ని పెంచుకునేందుకు స్ట్రాబెర్రీలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్నో బ్యూటీ ప్రోడెక్ట్స్‌లో కూడా స్ట్రాబెర్రీలను ఉపయోగిస్తూ ఉంటారు.

స్ట్రాబెర్రీలను ఉపయోగించి ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు. వీటిల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

స్ట్రాబెర్రీలు తినడం వల్ల అధిక బరువు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, పోషకాలు.. ఆకలిని నియంత్రిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా స్ట్రాబెర్రీలు ఎంతో చక్కగా ఉపయోగ పడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కూడా స్ట్రాబెర్రీలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో పేరుకు పోయిన మలినాలు, బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.




