Cleaning Tips: వాష్ రూమ్ నుంచి దుర్వాసన రాకూడదంటే ఇలా చేయండి..

ఒక్కోసారి బాత్రూమ్ నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పిన చిట్కాలు ట్రై చేయండి. బెస్ట్‌గా వర్క్ అవుతాయి. దీని వల్ల బాత్రూమ్ నుంచి చెడు వాసన రాకుండా ఉంటుంది..

Chinni Enni

|

Updated on: Dec 13, 2024 | 6:09 PM

ఎంత నీటిగా ఉంచినా, ఎంత శుభ్రం చేసినా ఒక్కోసారి వాష్ రూమ్ అదేనండి బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసనకు బాత్రూమ్‌కి వెళ్లాలనిపించదు. ఇక తప్పని పరిస్థితుల వల్ల బాత్రూమ్‌ని ఉపయోగిస్తారు. బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.

1 / 5
బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే.. అందులో నిమ్మకాయను కోసి సగం ముక్క ఒక మూలలో ఉంచండి. దీని వలన దుర్వాసన రాకుండా ఉంటుంది. లేదంటే వేడి నీటిలో బేకింగ్ సోడా, నిమ్మకాయ రసం పిండి క్లీన్ చేసినా వాసన రాదు.

2 / 5
బాత్రూమ్‌లో ఓ కవర్‌లో పుదీనా ఆకులు వేసి ఓ మూలన వేలాదీయండి. పుదీనా నుంచి మంచి వాసన వస్తుంది కాబట్టి.. దుర్వాసన తగ్గుతుంది. చెడు వాసన తగ్గాలంటే కేవలం బాత్రూమ్ లోపల కడిగితే సరిపోదు.. కిటీకీలు, తలుపులు కూడా నీటిగా శుభ్రం చేయండి.

3 / 5
అలాగే ఒక్కోసారి ఫ్లష్‌లో మురికి పట్టేసినా కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడూ ఫ్లష్ ట్యాంక్‌లో బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ వేయండి. బాత్రూమ్‌ని సాధారణ నీటితో కాకుండా వేడి నీటితో కడిగితే బ్యాక్టీరియా, మురికి అంతా పోతుంది.

4 / 5
లావెండర్ ఆయిల్ లేదా పుదీనా ఆయిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ని ఓ చిన్న డబ్బాలో వేసి కిటికీ దగ్గర ఉంచినా చెడు వాసన రాకుండా ఉంటుంది. వీటిని కలిపి బాత్రూమ్ కూడా కడగవచ్చు. డెటాల్ కూడా అప్పుడప్పుడు చల్లుతూ ఉండండి.

5 / 5
Follow us