- Telugu News Photo Gallery Eating papaya is very dangerous for health for those with these health problems
Papaya: బొప్పాయి వీరికి విషంతో సమానం.. ముట్టుకుంటే మటాషే!
బొప్పాయి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో తాజాగా, రుచిగా ఉండే బొప్పాయిలు మార్కెట్‌లోకి పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని తప్పనిసరిగా తినాలని చెబుతుంటారు. అయితే కొంతమంది బొప్పాయిని అస్సలు తినకూడదు. ప్రస్తుత మారిన జీవనశైలి కారణంగా..
Updated on: Nov 19, 2025 | 12:52 PM

బొప్పాయి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో తాజాగా, రుచిగా ఉండే బొప్పాయిలు మార్కెట్‌లోకి పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని తప్పనిసరిగా తినాలని చెబుతుంటారు.

అయితే కొంతమంది బొప్పాయిని అస్సలు తినకూడదు. ప్రస్తుత మారిన జీవనశైలిలో చాలా మంది మూలవ్యాధితో బాధపడుతున్నారు. మూలవ్యాధితో బాధపడేవారు బొప్పాయిని పూర్తిగా తినడం మానేయాలి. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

బొప్పాయి వేడి స్వభావం కలిగి ఉంటుంది. మూలవ్యాధి ఉన్న వ్యక్తి బొప్పాయి తింటే సమస్య పెరుగుతుంది. అయితే ఎనిమిది రోజులకు ఒకసారి బొప్పాయిని తక్కువ పరిమాణంలో తినవచ్చు.

బొప్పాయి చర్మానికి మేలు చేస్తుంది. బొప్పాయిని ముఖానికి రాసుకోవడం వల్ల అనేక సమస్యలు నయమవుతాయి. అయితే మీకు ఏవైనా చర్మ వ్యాధులు ఉంటే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ బొప్పాయిని ముట్టుకోకూడదు.

అలాగే గర్భిణీలు కూడా బొప్పాయి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే గర్భిణీలు వీటికి బదులు తాజా పండ్లు తినడం మంచిది.




