- Telugu News Photo Gallery Eating capsicum? Know these things for sure, check here is details in Telugu
Capsicum: క్యాప్సికమ్ తింటున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!
కూరగాయల్లో క్యాప్సికమ్ కూడా ఒకటి. క్యాప్సికమ్‌ను చాలా మంది ఇష్ట పడి మరీ తింటూ ఉంటారు. ఇతర వంటకాల్లో కూడా క్యాప్సికమ్ ఉపయోగించడం వల్ల రుచి పెరుగుతుంది. క్యాప్సికమ్‌లో అనేక రకాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే పోషకాలు కూడా ఎక్కువే. క్యాప్సికమ్‌ను ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. క్యాప్సికమ్ ఖరీదు ఎక్కవే కానీ.. వీటిల్లో ఉండే పోషకాలు కూడా అలాగే ఉంటాయి. వారంలో ఒక్కసారైనా క్యాప్సికమ్ తింటే.. బోలేడన్ని లాభాలు మీ సొంతం అవుతాయి. క్యాప్సికమ్ తినడం వల్ల విటమిన్ సి అనేది..
Updated on: May 31, 2024 | 7:35 PM

కూరగాయల్లో క్యాప్సికమ్ కూడా ఒకటి. క్యాప్సికమ్‌ను చాలా మంది ఇష్ట పడి మరీ తింటూ ఉంటారు. ఇతర వంటకాల్లో కూడా క్యాప్సికమ్ ఉపయోగించడం వల్ల రుచి పెరుగుతుంది. క్యాప్సికమ్‌లో అనేక రకాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే పోషకాలు కూడా ఎక్కువే. క్యాప్సికమ్‌ను ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు.

క్యాప్సికమ్ ఖరీదు ఎక్కవే కానీ.. వీటిల్లో ఉండే పోషకాలు కూడా అలాగే ఉంటాయి. వారంలో ఒక్కసారైనా క్యాప్సికమ్ తింటే.. బోలేడన్ని లాభాలు మీ సొంతం అవుతాయి. క్యాప్సికమ్ తినడం వల్ల విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది.

వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు అనేది ఈజీగా కరుగుతుంది. జీవక్రియ కూడా వేగంగా అవుతుంది. క్యాప్సికమ్‌లో క్యాప్సైసిన్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధించి.. క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది.

క్యాప్సికమ్‌ను మీ డైట్‌లో చేర్చుకుంటే.. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు అన్నీ దూరం అవుతాయి. కడుపు అల్సర్‌ను కూడా దూరం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

క్యాప్సికమ్ తినడం వల్ల చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. చర్మ అలర్జీలు కూడా తగ్గుతాయి. కంటి, ముక్కు సంబంధిత సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. క్యాప్సికమ్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.




