- Telugu News Photo Gallery Eat a cup of moong sprouts to get tons of health benefits Telugu Lifestyle News
Mung Bean Sprouts Benefits: బ్రేక్‌ఫాస్ట్‌లో మొలకెత్తిన పెసర్లు తింటే ఈ వ్యాధులన్నీ పరార్..!
మనం ప్రతినిత్యం అనేక రకాలైన పప్పులను తింటుంటాం. అందులో పెసరపప్పు కూడా ఒకటి. అయితే, పెసరపప్పు ఉపయోగాల నుంచి ఎప్పుడైనా ఆలోచించారా..? మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పెసరపప్పులో పుష్కలంగా ఉంటాయి. పెసరపప్పు తినటం వల్ల ఎన్నో రకాల రోగాలకు దూరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసర్లను తింటే కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు. పెసరపప్పుతో కలిగే ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 11, 2024 | 12:25 PM

పెసర పప్పుల్లో మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అలసటను పోగొట్టేందుకు, హాయిగా నిద్రపోయేందుకు పెసరపప్పు ఎంతగానో సహాయపడుతుంది. వీటితో పాటుగా మొలకెత్తిన పెసరపప్పును కూడా తినొచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసర్లను తినటం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మొలకెత్తిన పెసర్లలో యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్, విటమిన్-సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మొలకెత్తిన పెసర్లను బ్రేక్‌ఫాస్ట్‌లో తినటం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. అలాగే, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మొలకెత్తిన పెసర్లలో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య పోతుంది.

మొలకెత్తిన పెసర్లలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పులు వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. అంతేకాదు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. మొలకెత్తిన పెసర్లతో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రక్తం గడ్డకట్టే సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

మొలకెత్తిన పెసర్లు చర్మ సంరక్షణలో కూడా మేలు చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసర్లను తింటే మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మొలకెత్తిన పెసర్లను తినటం వల్ల వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది. మన చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మొలకెత్తిన పెసరలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది మన కళ్లకు మేలు చేస్తుంది. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కంటిచూపు పెరుగుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మొలకెత్తిన పెసర్లు చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయగల సామర్థ్యం వీటికి ఉంది. ప్రతిరోజు గుప్పెడు తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మొలకెత్తిన పెసర్లను తింటే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. శరీర లోపలి భాగాలను శక్తివంతం చేస్తుంది. మొలకెత్తిన పెసర్లు గర్భిణీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి మొలకెత్తిన పెసర్లు బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది.




