- Telugu News Photo Gallery Early Symptoms of Uterine Cancer: Overian Cancer Symptoms And Prevention methods
Overian Cancer: కడుపు ఉబ్బరం, అలసట, తరచూ మూత్ర విసర్జన.. లక్షణాలు కనిపిస్తున్నాయా? అలస్యం చేయకండి
థైరాయిడ్, మధుమేహం, క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య నేటి కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ నిశ్శబ్దంగా ప్రాణాలను హరిస్తుంది. వేలాది మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. అందుకే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు..
Updated on: May 30, 2024 | 8:50 PM

థైరాయిడ్, మధుమేహం, క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య నేటి కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ నిశ్శబ్దంగా ప్రాణాలను హరిస్తుంది. వేలాది మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. అందుకే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు.

గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను తెలుసుకుంటే ప్రమాదాన్ని నివారించడం సాధ్యమవుతుంది. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ముఖ్యమైనవి. అపానవాయువు అధికంగా రావడం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది ఈ సమస్యను ఎసిడిటీ సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మూత్ర సమస్యలు.. తరచుగా మూత్రవిసర్జన, మూత్రవిసర్జన నియంత్రించలేకపోవడం, మూత్రంతో రక్తస్రావం.. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు. చాలా మంది వ్యక్తులు ఈ లక్షణాలలో ఒకటి కనిపిస్తే డయాబెటీస్ వ్యాధి లక్షణమని భావించి నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా నిర్లక్ష్యం చేయవద్దు.

బరువు తగ్గడం, అలసట - అకస్మాత్తుగా బరువు తగ్గడం ప్రారంభించి, అన్ని సమయాలలో అలసిపోయినట్లు అనిపిస్తే అనుమానించాల్సిందే. ఇది వివిధ వ్యాధుల లక్షణం కావచ్చు. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలలో ఇది కూడా ఒకటి. ఇది పాదాల వాపుకు కూడా కారణం కావచ్చు.

క్రమరహిత ఋతు చక్రం- గర్భాశయ క్యాన్సర్ ప్రధాన లక్షణం క్రమరహిత ఋతు చక్రం. ఈ వ్యాధి ఉన్న వారిలో పీరియడ్స్ ప్రతి రెండు నుంచి మూడు నెలలకు వస్తాయి. చాలా మందికి నెలకు రెండు సార్లు కూడా పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో భరించలేని నొప్పి సంభవిస్తుంది. ఇలా జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు, క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే మీరు ప్రారంభ దశలోనే దానిని గుర్తించి చికిత్స ప్రారంభించినట్లయితే, త్వరగా కోలుకోడానికి సాధ్యమవుతుంది. అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయించుకోవల్సి ఉంటుంది.




