నవరాత్రి స్పెషల్ : ఏ తేదీన జన్మించిన వారు దుర్గామాతకు ఏ నైవేద్యం సమర్పించాలంటే?
నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రతి పల్లె, పట్నంలో ఘనంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది దుర్గామాత ఆశీర్వాదాలు పొందడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. దీని కోసం పూజలు చేయడం , అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, చీరలు సమర్పించడం, అంతే కాకుండా తల్లికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం చేస్తుంటారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, మీరు పుట్టిన తేదీని బట్టీ, అమ్మవారి ఆశీర్వాదం పొందాలంటే పుట్టిన తేదీని బట్టీ ఈ నైవేద్యాలు సమర్పించాలంట. అవి ఏవంటే?
Updated on: Sep 24, 2025 | 12:46 PM

ఎవరైతే నెల ఏదైనా సరే ఒకటో తేదీన జన్మిస్తారో వారిని సూర్యుడు పాలిస్తాడు. అయితే అటువంటి వారు నవరాత్రుల సమయంలో దుర్గామాతకు బెల్లం, అటుకులతో చేసిన హల్వాను నైవేద్యంగా పెట్టాలంట. ఇలా పెట్టడం వలన వీరి జీవితంలో ఉన్న సమ్యలన్నీ తొలిగిపోయి చాలా సంతోషంగా, నైవేద్యంలా మీ లైఫ్ చాలాస్వీట్‌గా గడిచిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

రెండో తేదీన జన్మించిన వారు చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తుంటారు. రెండవ సంఖ్య గల వ్యక్తులు చంద్రునిచే పాలించబడతారు. వీరు ఎప్పుడూ చాలా సున్నితంగా ఉండటమే కాకుండా, మంచి ఆలోచనా శక్తి కలిగిన వారు. అయితే ఈ తేదీలో జన్మించిన వారు దుర్గామాత ఆశీర్వాదం పొందాలి అటే, సేమియా పాయసం, లేదా బియ్యం, పాలతో చేసిన ఆహారపదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

మూడవ తేదీన జన్మించిన వ్యక్తులు దుర్గా మాత ఆశీర్వాదం పొందాలి అంటే. వీరు ప్రత్యేకంగా తమ చేతులతో శనగ లడ్డూ లేదా శనగలతో హల్వా చేసి అమ్మవారికి సమర్పించాలంట. దీని వలన ఈ తేదీలో జన్మించిన వారిని అమ్మవారు దీవిస్తుందని చెబుతున్నారు పండితులు.

నాలుగవ తేదీన జన్మించిన వారిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా దైవ దర్శనాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు దుర్గా మాతకు మినప వడ లేదా గారెలు చేసి సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంట. వీరు రాహువు చేత పాలించబడతారు.

ఐదవ తేదీన జన్మించిన వారు బుధ గ్రహం ఆధిపత్యంలో ఉంటారు వీరు అమ్మవారికి పండ్లు, ముఖ్యంగా జామకాయ సమర్పించడం చాలా మంచిదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



