- Telugu News Photo Gallery Drinking this drink will make you look beautiful in no time, Check Here is Details
Instant Beauty: పండగ సమయాల్లో తక్కువ సమయంలో అందంగా కనిపించాలా.. ఈ ట్రిక్ బెస్ట్!
ప్రస్తుతం అంతా పండుగలే ఉన్నాయి. ఒకదాని తర్వాత పండుగలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో పండుగలకు అందంగా కనిపించాలని మహిళలు అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి సమయం ఉండదు. అలాంటి సమయంలో ఈ డ్రింక్ బెస్ట్‌గా వర్క్ అవుతుంది. ఈ డ్రింక్ రెండు, మూడు రోజులు వరుసగా తాగారంటే.. మీ ముఖం మిలమిల మెరిసిపోవడం కాదు. బ్యూటీ పార్లర్‌కి వెళ్లినా రాని మెరుపు ఈ డ్రింక్ తాగితే మీకు..
Updated on: Oct 17, 2024 | 8:06 PM

ప్రస్తుతం అంతా పండుగలే ఉన్నాయి. ఒకదాని తర్వాత పండుగలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో పండుగలకు అందంగా కనిపించాలని మహిళలు అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి సమయం ఉండదు. అలాంటి సమయంలో ఈ డ్రింక్ బెస్ట్‌గా వర్క్ అవుతుంది.

ఈ డ్రింక్ రెండు, మూడు రోజులు వరుసగా తాగారంటే.. మీ ముఖం మిలమిల మెరిసిపోవడం కాదు. బ్యూటీ పార్లర్‌కి వెళ్లినా రాని మెరుపు ఈ డ్రింక్ తాగితే మీకు లభిస్తుంది. మరి ఆ బ్యూటీ డ్రింక్ ఏంటో ఇప్పుడు చూడండి.

ఈ డ్రింక్ తాగడం వల్ల కేవలం అందమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చర్మం లోపలి నుంచి గ్లో తీసుకొస్తుంది. అదే క్యారెట్, టమాటా జ్యూస్. ఈ జ్యూస్ రెండు సార్లు తాగితేనే ఆ తేడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది.

టమాటా, నిమ్మరసం, క్యారెట్ కలిపి తయారు చేసే ఈ డ్రింక్.. చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మీరు తేనె కలిపి కూడా తాగవచ్చు. ఈ జ్యూస్‌లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాల ఉత్పత్తిని ప్రేరపిస్తాయి.

కాబట్టి మీ ముఖానికి సహజమైన గ్లో వస్తుంది. ముఖం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎండ నుంచి కూడా రక్షణను ఇస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఆపుతుంది. శరీరం డీటాక్సీఫై అయి.. హైడ్రేట్‌గా మారుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




