పెళ్లిళ్లలో ఎక్కువగా రెడ్ కలర్ డ్రస్, సారీస్ ఎందుకు ధరిస్తారో తెలుసా?
మన భారత సాంప్రదాయంలో పెళ్లి అనేది జీవితంలో అతి పెద్ద వేడుక. అందుకే చాలా మంది ఈ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. ఇలా లైఫ్ టైమ్ మెమోరీగా నిలిచిపోయే వేడుకలో వధూవరులు మహిళలు ధరించే దుస్తులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో చాలా మంది ముఖ్యంగా వధువులు ఎక్కువగా ఎరుపు రంగు చీరలు లేదా డ్రస్‌లను ధరిస్తుంటారు. దీనికి కారణం మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకుందాం పదండి.
Updated on: Nov 08, 2025 | 5:53 PM

భారతదేశంలో జరిగే ప్రతి వేడుకకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా వివాహాలు, పెళ్లిళ్లు ఒక్కో ప్రాంతంలో ఒక్క సాంప్రదాయంతో నిర్వహిస్తుంటారు. కానీ ఆ వేడుకల్లో వదువు ధరించే దుస్తుల రంగు మాత్రం ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటుంది.

చీరల నుండి లెహంగాల వరకు, పెళ్లివేడుకలో మనం తరచుగా వధువులను ఎరుపు రంగులో చూస్తాము. వివాహ దుస్తులు ఎరుపు రంగులో ఉండటానికి బలమైన కారణం ఉంది.

ఎరుపు రంగు అనేది దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన రంగు, దీనితో పాటు చాలా మంది ఎరుపు రంగును కుంకుమ పువ్వులా చాలా ప్రవిత్రంగా భావిస్తారు. అందుకనే పెళ్లి వంటి శుభకార్యాల్లో వధవులు ఎరుపు రంగు దుస్తువులను ధరిస్తారు.

ఇవే కాకుండా ఎరుపు రంగుకు అనేక అర్థాలు ఉన్నాయి. ఎరుపు ఒక వైపు కొత్త ప్రారంభాలను సూచిస్తుండగా, మరోవైపు సంపదను కూడా సూచిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఎరుపు రంగు ధైర్యం, మానసిక బలాన్ని సూచిస్తుంది. వివాహం తర్వాత, వధువు ధైర్యంగా ఉండి తన భర్త ఇంట్లో ప్రతిదీ ప్రశాంతంగా నిర్వహించాలనే ఆశతో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు.

పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి..ఇవి కేవలం అవగాహన మేరకే మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించలేదు




