- Telugu News Photo Gallery Do you know the side effects of eating these eight ingredients with tea Telugu Lifestyle News
టీలో ఈ ఎనిమిది పదార్థాలను కలిపి తాగారో అంతే సంగతులు
టీ తాగుతే అలసిపోయిన శరీరానికి ఉత్సాహం వస్తుంది. ఒక కప్పు టీ తాగితే చాలు..అలసట, నీరసం తొలగిపోతుంది. చాయ్ ప్రేమికులైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా టీ తాగుతూనే ఉంటారు.
Updated on: Apr 29, 2023 | 9:55 AM

టీ తాగుతే అలసిపోయిన శరీరానికి ఉత్సాహం వస్తుంది. ఒక కప్పు టీ తాగితే చాలు..అలసట, నీరసం తొలగిపోతుంది. చాయ్ ప్రేమికులైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా టీ తాగుతూనే ఉంటారు. అయితే టీ తోపాటు కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. కొందరికి టీ తాగుతూ ఆహారం తినడం అలవాటు ఉంటుంది. కానీ కొన్ని ఆహారపదార్థాలు మాత్రం టీతో కలిసి అస్సలు తీనకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

నిమ్మరసం: కొంతమంది టీతోపాటు నిమ్మరసం తాగుతుంటారు. ఇలా తాగితే బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతుంటారు. అయితే టీతోపాటు నిమ్మరసం కలుస్తే టీ ఆమ్లంగా మారుతుంది. ఫలితంగా ఉబ్బరం కలిగిస్తుంది. లెమన్ టీ ఉదయం ఖాళీ కడుపుతో తాగినట్లయితే..యాసిడ్ రిఫ్లక్స్ గుండెల్ల మంట వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

పండ్లు: మనలో చాలామందికి ఉదయం టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తాగిన తర్వాత బ్రేక్ ఫాస్టులో చాలా మంది పండ్లు తింటుంటారు. అయితే టీ తాగిన వెంటనే పండ్లు తినకూడదు. రెండింటి మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

పసుపు: కొంతమంది టీలో పసుపు కలుపుని తాగుతుంటారు. ఇది తాగడం పొరపాటు. ఎందుకంటే వీటిలో ఉండే కర్కుమిన్ లు, టానిన్ లు కడుపుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫలితంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.


ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు: ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని టీతోపాటు కలిపి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే టీలో టానిన్లు, ఆక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారంలోని ఐరన్ ను ఎక్కువగా గ్రహించడాన్ని నిరోధిస్తాయి. ఐరన్ ఎక్కువగా ఉండే గింజలు, పచ్చిఆకుకూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, త్రుణధాన్యాలతను టీతో కలిపి తినకూడదు.

బెసిన్ ఆహారాలు : చాలామంది పకోడిలు, నామ్ కీన్ టీతో కలిపి తింటుంటారు. టీ తాగే సమయంలో స్నాక్స్, శనగపిండితో చేసిన స్నాక్స్ అస్సలు తినకూడదు. ఎందుకంటే కొంతమందికి దుష్ర్పభావాలు కలిగిస్తాయి. టీతాగేటప్పుడు శనగపిండితో చేసిన ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఐస్ క్రీ: వేడి వేడి టీ తాగుతూ...చల్లని గడ్డకట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వికారం, వాంతులను కలిగిస్తుంది. టీ తాగిన తర్వాత కనీసం అరగంట వరకు చల్లని పదార్థాలు తినకూడదు.

పరాటా: పరాటా తిని టీ తాగుతే రోజంతా ఉండవచ్చు. రోజంతా ఆకలే ఉండదు. పరాటాతోపాటు చాయ్ తాగితే కొంతమందిలో ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.



