- Telugu News Photo Gallery Do you know the benefits of eating ragi roti? check here is details in Telugu
Ragi Roti Benefits: రాగి రొట్టె తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా.. డోంట్ మిస్!
మిల్లెట్స్‌లో రాగులు కూడా ఒక భాగం. మిల్లెట్స్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. రాగులతో మనం చాలా రకాల ఆహార పదార్థాలు చేసుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కాబట్టి.. శరీరానికి శక్తిని ఇచ్చి చల్లబరిచేందుకు రాగి జావ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. వేసవి కాలంలో దీన్ని తాగితే డీహైడ్రేషన్‌కు..
Updated on: Mar 30, 2024 | 3:35 PM

మిల్లెట్స్‌లో రాగులు కూడా ఒక భాగం. మిల్లెట్స్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. రాగులతో మనం చాలా రకాల ఆహార పదార్థాలు చేసుకోవచ్చు.

అందులోనూ ఇప్పుడు సమ్మర్ కాబట్టి.. శరీరానికి శక్తిని ఇచ్చి చల్లబరిచేందుకు రాగి జావ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. వేసవి కాలంలో దీన్ని తాగితే డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు. అలాగే రాగులతో రొట్టెలు కూడా తయారు చేసుకుంటారు.

రాగి ముద్ద, రాగి జావ మాత్రమే కాదు.. రాగులతో తయారు చేసిన రొట్టెలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని తినడం వల్ల ముఖ్యంగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే వీటిల్లో ఫైబర్, ప్రోటీన్ అనేవి ఉంటాయి. కాబట్టి రాగి రొట్టెలను తింటే బరువు కంట్రోల్‌లోకి వస్తుంది.

ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధ పడేవారు రాగి రొట్టెలు తింటే చాలా మంచిది. వీటిల్లో ఉండే కార్బొహైడ్రేట్స్, ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెరగనివ్వదు. అంతే కాకుండా ఆకలిని కూడా అదుపు చేస్తుంది. అలాగే తక్షణ శక్తి ఇస్తుంది.

రాగి రొట్టెలు తినడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అలాగే పేగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మలబద్ధక సమస్య ఏర్పడకుండా చేస్తుంది. రాగి రొట్టెలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గోధుమ పిండి రొట్టెల కంటే ఇవి ఎంతో ఆరోగ్యకరం.




