- Telugu News Photo Gallery These foods should not be eaten at all if there is a Acidity Problem, check here is details
Acidity Problem: కడుపులో మంటా.. ఈ ఆహారాలను అస్సలు తినకండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే..
Updated on: Mar 30, 2024 | 4:00 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే కడుపులో మంట వస్తుంది.

ఇలా కడుపులో మంటతో ఇబ్బంది పడే సమయంలో కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. కారం ఉండే వెల్లుల్లి, పచ్చి మిర్చి, మిరపకాయలు, మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చేదుగా ఉండే ఆహారాలు కూడా తినకూడదు.

కడుపులో మంటగా ఉన్నప్పుడు పుల్లగా ఉండే ఆహారాలు కూడా తీసుకోకుండా ఉండాలి. కొవ్వు పదార్థాలు, తియ్యగా ఉండే ఆహారాలు తినకూడదు. అలాగే ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి.

కడుపులో మంట ఎక్కువగా ఉంటే పెరుగు, మామిడి, పచ్చకాయ, ఖర్బూజా, అరటి పండు, యాపిల్, దానిమ్మ వంటిని తీసుకోవాలి. అలాగే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తినడం చాలా మంచిది.




