- Telugu News Photo Gallery Do you know how many health benefits of eating Jowar Roti? check here is details in Telugu
Jonna Rotte Benefits: జొన్న రొట్టె తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నలు కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఒకటి. జొన్నల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. జొన్నలతో తయారు చేసే రొట్టెలు ఎంతో శక్తి వంతమైన ఆహారం. గోధుమ పిండి రొట్టెల కంటే జొన్న రెట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నల రొట్టె తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇది తినడం వల్ల రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియకు..
Chinni Enni | Edited By: Janardhan Veluru
Updated on: Mar 26, 2024 | 5:56 PM

చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నలు కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఒకటి. జొన్నల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. జొన్నలతో తయారు చేసే రొట్టెలు ఎంతో శక్తి వంతమైన ఆహారం. గోధుమ పిండి రొట్టెల కంటే జొన్న రెట్టె ఆరోగ్యానికి చాలా మంచిది.

జొన్నల రొట్టె తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇది తినడం వల్ల రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియకు చాలా మంచిది.

జొన్నలతో తయారు చేసిన రొట్టెల్లో ఐరన్ కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి రక్త హీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటే.. దీని నుంచి బయట పడొచ్చు. తరచూ ఈ రొట్టెలను తింటే.. శరీరంలో వృద్ధాప్య ఛాయలు కూడా తక్కువగా వస్తాయి.

అలాగే శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేస్తాయి. అదే విధంగా బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రొట్టెలను తింటూ ఉంటే.. త్వరగా వెయిట్ లాస్ అవుతారు. వీటిని తినడం వల్ల తక్షణమే ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

అంతే కాకుండా శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నశింప జేస్తుంది. జొన్నె రొట్టెలు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా డయాబెటీస్, బీపీ ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు.





























