- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 From Virat Kohli to Shikar Dhawan and Dinesh Karthik these player Eyes On This Unique Record in Rcb vs Pbks
IPL 2024: చిన్నస్వామిలో స్పెషల్ రికార్డులపై కన్నేసిన కోహ్లీ, ధావన్, డీకే.. అవేంటంటే?
IPL 2024: ఐపీఎల్ (IPL 2024) 17వ ఎడిషన్‌లో భాగంగా ఆరవ మ్యాచ్ RCB హోమ్ గ్రౌండ్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ భారీ రికార్డుపై కన్నేశారు. అదే సమయంలో దినేష్ కార్తీక్ కూడా తన పేరిట ఒక ప్రత్యేక రికార్డును లిఖించుకునే దశలో ఉన్నాడు.
Updated on: Mar 25, 2024 | 7:50 PM

ఐపీఎల్ 2024లో ఆరో మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆర్‌సీబీ తొలి విజయంపై కన్నేసింది. పంజాబ్ లీగ్‌లో వరుసగా రెండో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ఆరో మ్యాచ్ ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ భారీ రికార్డుపై కన్నేశారు. అదే సమయంలో, దినేష్ కార్తీక్ కూడా తన పేరిట ఒక ప్రత్యేక రికార్డును లిఖించుకునే దశలో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 బౌండరీలు కొట్టి ఐపీఎల్‌లో 650 బౌండరీల రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 238 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి, ఏడు సెంచరీలు, 50 అర్ధసెంచరీల సాయంతో 7284 పరుగులు చేశాడు.

RCB వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా IPL లో 150 సిక్సర్ల రికార్డు సృష్టించడానికి దగ్గరగా ఉన్నాడు. ఈ రికార్డు రాయాలంటే డీకేకి మరో ఏడు సిక్సర్లు కావాలి. ఒకే మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదడం కష్టమైనా.. అద్భుత ఫామ్ లో ఉన్న కార్తీక్ తో అసాధ్యమేమీ కాదు.

ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 150 సిక్సర్లు కొట్టే అవకాశం ఉంది. ధావన్ వద్ద కేవలం 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. ధావన్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈ మ్యాచ్‌లో గబ్బర్ ఈ ఫీట్ సాధించగలడు.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆర్‌సీబీ 14 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ 17 మ్యాచ్‌లు గెలిచింది.

అదే సమయంలో బెంగళూరులో ఇరు జట్ల మధ్య 11 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ 6, పంజాబ్ 5 గెలిచాయి. మొత్తం గణాంకాలను పరిశీలిస్తే, RCBపై పంజాబ్ పైచేయి సాధించింది. సొంతమైదానంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఆర్‌సీబీ, పంజాబ్‌పై విజయం రుచి చూడటం ఓదార్పునిస్తుంది.




