Tips for Pink Lips: నల్లని పెదాలు గులాబీ రంగులో ఉండాలంటే ఇలా చేయండి..
ముఖంలో అందర్నీ త్వరగా ఆకర్షించేది నవ్వు మాత్రమే. నవ్వడం వల్ల ఎదుటి వారు మీతో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువు సమయం పట్టదు. మరి మీ పెదాలు గులాబీ రంగులో ఉంటే మరింత.. మీ నవ్వు ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంది ముఖంపై చూపించే శ్రద్ధ పెదాలపై చూపించారు. చాలా మంది పెదాలు నల్లగా, డ్రైగా మారడానికి అశ్రద్ద కూడా ఒక కారణం. పెదాలకు పోషణ సరిగా అందించక పోవడం వల్ల అంద విహీనంగా మారతాయి. మరి మీ పెదాలు అందంగా, పింక్ కలర్‌లోకి..
Updated on: Aug 07, 2024 | 7:05 PM

ముఖంలో అందర్నీ త్వరగా ఆకర్షించేది నవ్వు మాత్రమే. నవ్వడం వల్ల ఎదుటి వారు మీతో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువు సమయం పట్టదు. మరి మీ పెదాలు గులాబీ రంగులో ఉంటే మరింత.. మీ నవ్వు ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంది ముఖంపై చూపించే శ్రద్ధ పెదాలపై చూపించారు.

చాలా మంది పెదాలు నల్లగా, డ్రైగా మారడానికి అశ్రద్ద కూడా ఒక కారణం. పెదాలకు పోషణ సరిగా అందించక పోవడం వల్ల అంద విహీనంగా మారతాయి. మరి మీ పెదాలు అందంగా, పింక్ కలర్‌లోకి మారాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి.

కొద్దిగా పంచదార తీసుకుని మీ పెదాలను సున్నితంగా రుద్దండి. ఇలా చేయడం వల్ల మీ పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి నీటిగా అవుతాయి. ఆ తర్వాత కొబ్బరి నూనె లేదా వేజెలీన్ అప్లై చేయండి. ఇలా రాత్రి పూట చేయడం వల్ల పెదాలు హైడ్రేట్‌గా ఉంటాయి.

తేనెతో కూడా పెదాల రంగును మార్చవచ్చు. కొద్దిగా అలోవెరా జెల్ తీసుకోండి. ఇందులో కొద్దిగా తేనె కలిపి పెదాలపై అప్లై చేయండి. ఇలా పావు గంట ఉంచి ఆ తర్వాత శుభ్రం చేయండి. లేదంటే కేవలం తేనె అయినా పెదాలపై రాయవచ్చు. ఇలా చేసిన పెదాలు అందంగా మారతాయి.

మహిళల అందాన్ని పెంచడంలో పెదాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పెదాలు ఎర్రగా, మెరుస్తూ కనిపిస్తే వచ్చే అందమే వేరు. ఈ క్రమంలోనే చాలా మంద ఆడవాళ్ళు లిప్ స్టిక్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొంత మంది పెదాలు నిర్జీవంగా, పొడి బారి పోయి ఉంటాయి. కాబట్టి వీటి పట్ల శ్రద్ధ తీసుకోవాలి.




