- Telugu News Photo Gallery Are these symptoms visible on the skin? be careful, Check Here is Details in Telugu
Lung Cancer: జాగ్రత్త.. చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ఇదే వ్యాధి కావచ్చు!
రోజులు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే సంఖ్య కూడా రెట్టింపు అవుతుంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా, కాలుష్యం వంటి వాటి వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడేవారి సంఖ్య పెరుగుతుంది. లంగ్ క్యాన్సర్ ముదిరి చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ చర్మంపై కనిపించే కొన్ని లక్షణాలతో మనం ఈజీగా ఈ వ్యాధిని పసిగట్టవచ్చు. లంగ్ క్యాన్సర్ ఉంటే ప్రధానంగా..
Updated on: Aug 07, 2024 | 6:06 PM

రోజులు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే సంఖ్య కూడా రెట్టింపు అవుతుంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా, కాలుష్యం వంటి వాటి వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడేవారి సంఖ్య పెరుగుతుంది.

లంగ్ క్యాన్సర్ ముదిరి చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ చర్మంపై కనిపించే కొన్ని లక్షణాలతో మనం ఈజీగా ఈ వ్యాధిని పసిగట్టవచ్చు. లంగ్ క్యాన్సర్ ఉంటే ప్రధానంగా దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కనిపిస్తాయి.

చర్మం నీలం లేదా వంకాయ రంగులోకి మారుతుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి.. చర్మం రంగు మార్తుంది. అంతే కాకుండా చేతి వేళ్లు, గోర్లు, చేతులపై కూడా రంగు మారడం కనిపిస్తుంది. చర్మంపై ఎరుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి.

అదే విధంగా చర్మంపై గీతలు, దద్దర్లు కూడా ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఛాతీపై మెడపై కూడా కనిపిస్తాయి. చర్మంపై ఎక్కువగా దురద పెడుతుంది. అలాగే ముఖంలో సగ భాగంలో చెమటలు పట్టడం ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు

ముఖంపై ఒకవైపే చెమట్లు పడితే లంగ్ కేన్సర్ ఉన్నట్లే. లంగ్ కేన్సర్ ఉన్నప్పుడు శరీరంలో రక్త ప్రసరణ కూడా సరిగా జరగదు. దీంతో కండరాల నొప్పులు, తిమ్మిర్లు వస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి అశ్రద్ధ లేకుండా వెంటే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.




