- Telugu News Photo Gallery Do not discuss your marriage problems with friends Relationship Tips in Telugu
భార్యాభర్తలూ అలర్ట్.. మీరు అన్ని విషయాలను స్నేహితులతో చెబుతున్నారా..? డేంజర్ జోన్‌లో ఉన్నట్లే
వివాహబంధం చాలా పవిత్రమైనది.. భార్యాభర్తలు ఇద్దరి నమ్మకం మీద కొనసాగుతుంది.. అయితే.. సాధారణంగా కొంతమంది సంబంధంలోని (రిలేషన్‌షిప్) సమస్యలను స్నేహితులతో పంచుకుంటారు.. వారితో భర్త లేదా భార్య గురించి అన్ని చెప్పేసుకుని సలహాలను తీసుకుంటారు.. అయితే ఇలా చేయడం సరైనదేనా..? మూడో వ్యక్తితో పర్సనల్ విషయాలను పంచుకోవచ్చా..? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు..
Updated on: Aug 17, 2024 | 4:13 PM

వివాహబంధం చాలా పవిత్రమైనది.. భార్యాభర్తలు ఇద్దరి నమ్మకం మీద కొనసాగుతుంది.. అయితే.. సాధారణంగా కొంతమంది సంబంధంలోని (రిలేషన్‌షిప్) సమస్యలను స్నేహితులతో పంచుకుంటారు.. వారితో భర్త లేదా భార్య గురించి అన్ని చెప్పేసుకుని సలహాలను తీసుకుంటారు.. అయితే ఇలా చేయడం సరైనదేనా..? మూడో వ్యక్తితో పర్సనల్ విషయాలను పంచుకోవచ్చా..? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు.. వివరాలను తెలుసుకోండి.. వాస్తవానికి భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి సమస్యను ఎదుర్కొనేదే విజయవంతమైన వివాహం బంధం అంటారు.. సంబంధంలో ఏదైనా మూడవ వ్యక్తికి ప్రవేశం కల్పిస్తే.. అది సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అందుకే.. శ్రేయోభిలాషులు, స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవడం మానేయాలి.. ప్రతి ఒక్కరికి సంబంధాలలో విభిన్న అనుభవాలు ఉంటాయి. అందువల్ల, మీ సంబంధ సమస్యలను మూడవ వ్యక్తి కోణం నుంచి పరిష్కరించాలనే తప్పును మీరు ఎప్పటికీ చేయకూడదు. రిలేషన్ లో మూడో వ్యక్తి ప్రమేయం ఏ విధంగా దూరాన్ని పెంచి.. సమస్యలను సృష్టిస్తుంది.. సంబంధాల చిట్కాలను తీసుకోవద్దడానికి 4 కారణాలు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

వివాహ బంధంలో సమస్యలు వ్యక్తిగతమైనవి.. సున్నితమైనవి. మీరు వీటిని స్నేహితులతో పంచుకున్నప్పుడు, మీ గోప్యత ప్రభావితమవుతుంది. ఏదైనా బహిరంగంగా బహిర్గతం చేయడం వలన మీకు, మీ భాగస్వామికి మధ్య ఉన్న వ్యక్తిగత విషయాలను ఇతరులకు వ్యాప్తిచేస్తుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

స్నేహితులు మీ సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోకుండానే.. వాటికి పరిష్కారాలు ఇవ్వగలరు, అది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. వారు ఉద్దేశపూర్వకంగా దీన్ని చేయరు.. కానీ సలహాలిచ్చే వ్యక్తి సంబంధంలో వారు చెడు అనుభవాన్ని కలిగి ఉంటే, వారు ఆరోగ్యకరమైన సంబంధం కోసం మీకు చిట్కాలను ఇవ్వలేరు.

మీరు మీ వివాహ సమస్యలను స్నేహితులతో పంచుకున్నప్పుడు, సామాజిక ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతుంది. స్నేహితులు మీ సమస్యల గురించి ఇతరులకు చెప్పవచ్చు.. ఇది సామాజిక స్థాయిలో మీ ప్రతిష్టను ప్రభావితం చేయవచ్చు. ఇంకా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది.

సమస్యను పరిష్కరించడానికి ఉత్తమ మార్గం తరచుగా మీరు.. మీ భాగస్వామి కలిసి మాట్లాడుకోవడం.. అర్థం చేసుకోవడం.. మీరు మీ సమస్యలను స్నేహితులతో పంచుకున్నప్పుడు, మీరు మీ భాగస్వామితో పరస్పర అవగాహన, పరిష్కారానికి బదులుగా బయటి సలహాలపై ఆధారపడేలా చేస్తుంది. అందుకే.. మీ బంధంలో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోండి.




