తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ, క్వినోవా వంటి కాంప్లెక్స్ పిండి పదార్థాలు కలిగిన ఆహారాలు పిల్లలకు మంచివి. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న పిల్లలకు ఈ తృణధాన్యాలతో పాటు చిలగడదుంప, మొక్కజొన్న, పప్పు, బీన్స్, రాజ్మా, కాబూలీ చనా వంటి వాటిని వారి డైట్‌లో ఉంచవచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతుంటే చియా విత్తనాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.