దాల్చిన చెక్క డిటాక్స్ డ్రింక్ యాపిల్, దాల్చిన చెక్క కలయిక వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆపిల్, నిమ్మకాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో గ్లాసు నీరు పోసి యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, అల్లం ముక్కలు, నిమ్మకాయ ముక్కలు అందులో వేయాలి. 6 నుంచి 7 గంటలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి. అందులో కొంచెం తేనె కలుపుకుని తాగాలి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.