- Telugu News Photo Gallery Cricket photos Pakistan lost 13 t20i matches in 2024 check indian team place
Pakistan: ఆడింది 22 మ్యాచ్‌లు.. ఓడింది 13 మ్యాచ్‌లు.. చెత్త రికార్డులో చేరిన పాక్.. భారత్ ప్లేస్ ఎక్కడంటే?
Pakistan Record: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు తడబడింది. హ్యాట్రిక్ పరాజయాలతో, ఈ ఏడాది అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టుగా చెత్త రికార్డులో చేరింది. ఈ లిస్టుల్ భారత జట్టు ఎక్కడుందో ఓసారి చూద్దాం..
Updated on: Nov 20, 2024 | 8:55 AM

పాకిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ హ్యాట్రిక్ పరాజయాలతో 2024లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఓడిన జట్ల జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది.

ఈ ఏడాది మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ జట్టు 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో 2 మ్యాచ్‌లు రద్దయ్యాయి. మిగిలిన 13 మ్యాచ్‌లు విఫలమవడంతో, ఈ ఏడాది అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఓడిన జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.

మరోవైపు ఈ ఏడాది 26 మ్యాచ్‌లు ఆడగా.. 24 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై మాత్రమే భారత జట్టు ఓడిపోయింది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించింది.

అయితే నాయకత్వ మార్పుతో ఎన్నో సిరీస్‌లు ఆడిన పాకిస్థాన్ చాలా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పుడు మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఆర్మీ ఆస్ట్రేలియాలో వైట్ వాష్ చవిచూసింది. ఈ ఏడాది అత్యధిక T20 మ్యాచ్‌ల పరాజయాలతో పూర్తి సభ్య (టెస్ట్-ప్లేయింగ్) జట్టుగా కూడా నిలిచింది.

2024లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఓడిన తొలి జట్టుగా ఇండోనేషియా నిలిచింది. మొత్తం 26 మ్యాచ్‌లు ఆడిన ఇండోనేషియా 15 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న పాక్ 2 మ్యాచ్‌ల్లో ఓడిపోతే చెత్త రికార్డును సొంతం చేసుకుంటుంది.





























