Movie Releases: ఈ వారం చిన్న సినిమాల హవా.. థియేటర్లలో ఈ మూవీస్ సందడి..
ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీ. దీని కారణం వీకెండ్ కావడం.శుక్రవారం తర్వాత శనివారం, ఆదివారం సెలవును కాష్ చేసుకోవాలని ఉద్దేశంతో ఇలా చేస్తారు అని చాలామందికి తెలుసు.. అయితే ఈ శుక్రవారం చిన్న సినిమాల సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి.? నటించింది ఎవరు.? ఇలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Nov 20, 2024 | 9:28 AM

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా రూపొందిన బహుభాషా చిత్రం ‘జీబ్రా’. ఇందులో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటించారు. సత్యరాజ్, సునీల్ తదితరులు ముఖ్యపాత్రల్లో ఎస్.ఎన్. రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేశ్ సుందరం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విశ్వక్సేన్హీరోగా హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ముఖ్యపాత్రల్లో సునీల్, నరేశ్ వి.కె తదితరులు నటించారు. ఈ మూవీ నవంబరు 22న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. మానస వారణాసి కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమా డివోషనల్ టచ్ కుటుంబ కథగా తెరకెక్కింది. హనుమాన్తో పాన్ ఇండియా రేంజ్ అందుకున్న ప్రశాంత్ వర్మ కథతో.. అర్జున్ జంధ్యాల రూపొందించిన చిత్రమిది. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకులను అలరించనుంది.

జబర్దస్త్ టీం లీడర్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తూ నిర్మించిన తొలి చిత్రం ‘కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్)’. ఈ మూవీలో అనన్యకృష్ణన్ హీరోయిన్. బంజారా వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితా సంఘటనల ఆధారంగా గరుడవేగ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, ధనరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్.యువన్ దర్శకత్వంలో సన్నీ లియోనీ, కమెడియన్ యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మందిర’. హారర్ కామెడీగా రూపొందిన ఇందులో సన్నీ ఇందులో యువరాణిగా కనిపించనుంది. ఈ మూవీ నవంబరు 22న విడుదల చేయనున్నారు మేకర్స్.




