Tiger Video: ఆ పులి.. ఈ పులేనా.? వైరల్ అవుతున్న పెద్దపులి వీడియో..
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని పెంబి తాండాలో పెద్దపులి సంచరిస్తుందని.. ఆ పులి ఇదే అంటూ ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేసారు నెటిజన్స్. మరోవైపు పులి జాడ తెలుసుకునేందుకు దాని పాదముద్రల కోసం వెతుకుతున్నారు ఫారెస్ట్ అధికారులు. పెద్దపులి సంచారం నేపథ్యంలో పెంబి గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరూ అడివివైపు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు.
నిర్మల్ జిల్లాలో గత 20 రోజులుగా సంచరిస్తున్న బెబ్బులి.. నర్సాపూర్, మామడ, పెంబి రేంజ్ లు దాటుకుంటూ కవ్వాల్ అభయారణ్యం వైపు సంచరిస్తోంది. ఈ క్రమంలో పశువుల మందలపై దాడి చేస్తూ ఆవులు , గేదేలను పొట్టన పెట్టుకుంటోంది. 20 రోజుల వ్యవధిలో దాదాపు 8 పశువులను హతమార్చింది బెబ్బులి. ఆడ తోడు కోసం ప్రయాణం చేస్తున్న ఆరున్నరేళ్ల మగ పులిగా గుర్తించింది అటవిశాఖ. మహారాష్ట్ర సరిహద్దుకిన్వట్ అభయారణ్యం లోని అప్పారావు పేట్ రేంజ్ నుండి సహ్యాద్రి పర్వత శ్రేణులను దాటుతూ పెంబి అటవి ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బెబ్బులి. అయితే ఇప్పుడు ఆ పులి ఇదేనంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. గంభీరంగా అభయారణ్యంలో అడుగులు వేస్తూ కొండలు గుట్టలు ఎక్కుతూ ముందుకు సాగుతున్న ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

