Screen Effect: నిద్ర లేవగానే సెల్‌ఫోన్ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే మైండ్ బ్లాకే..
ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ మయంగా మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం. ఇప్పుడు నిద్రలేచిన వెంటనే ఫోన్లను చెక్ చేయడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అలారం ఆఫ్ చేయడం.. సోషల్ మీడియాలో నోటిఫికేషన్లు చూడటం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి రోజు దినచర్యలో ఓ భాగమైపోతున్నాయి.
మీరు ఎప్పుడైనా ఈ అలవాటు వల్ల కలిగే హాని గురించి ఆలోచించారా? మన నిత్య జీవితంలో స్క్రీన్‌ల వినియోగం పెరుగుతున్నందున అవి మన ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిద్రలేచిన వెంటనే ఫోన్లను చెక్ చేయడం వల్ల అది మన మానసిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన కళ్లు తెరిచిన వెంటనే ఫోన్లలో ఈమెయిల్స్, మేసేజ్ లు, సోషల్ మీడియా అప్డేట్లు చూస్తుంటాం. దీంతో మనం రోజును ప్రారంభించకముందే ఎక్కువ స్ట్రెస్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ల స్క్రీన్ల నుంచి వెలువడే నీలి రంగు కాంతి కిరణాలు నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయట. స్క్రీన్ నుంచి వచ్చే కృత్రిమ నీలికాంతి నిద్రమేల్కొనే చక్రాన్ని నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పొద్దున్నే లేవగానే సెల్ ఫోన్లకు స్క్రీన్లకు అతుక్కపోవడం వల్ల మనలో ఎక్కువుగా పరధ్యానం, వాయిదాలు వేసే తత్వం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. కొత్త సమాచారం చూసేందుకు మనం ఇష్టపడతాం కాబట్టి.. రోజువారీ పనులకు బ్రేక్ వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఉదయం పూట ఫోన్ చూడటం వల్ల మిగతా రోజు మొత్తాన్ని అది డిస్టర్బ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా మనం చేసే పనులపై ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా ప్రతికూలత ప్రభావంతో ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. రోజంతా అదే ఎమోషన్ తో ఉండేలా చేస్తుంది. ఇది మన మానసిక స్థితి, శక్తిపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సోషల్ మీడియాను చెక్ చేసుకునేందుకు ఓ నిర్ధిష్ట సమయాలన్ని సెట్ చేసుకోవాలి అంటున్నారు. నిద్ర లేవగానే చదవడం, వ్యాయామం చేయడంతో మన రోజువారీ కార్యక్రమాలను మొదలుపెట్టడం నేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

