Telangana: ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు

వరంగల్ జిల్లాలోని ఓ SBI బ్రాంచ్‌లో భారీ దోపిడీ జరిగింది.. దొంగలు బీభత్సం సృష్టించారు.. సోమవారం రాత్రి దొంగలు బ్యాంకు వెనుక ఉన్న కిటికీని గ్యాస్ కట్టర్ తో కట్ చేసి బ్యాంకులోకి చొరబడ్డారు.. అనంతరం దుండగులు భారీ ఎత్తున 19 కిలోల బంగారం అపహరించుకువెళ్లారు. బ్యాంక్ సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

Telangana: ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
Robbery In Rayaparthy SBI Bank
Follow us
G Peddeesh Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 20, 2024 | 12:32 PM

వరంగల్ జిల్లాలోని ఓ SBI బ్రాంచ్‌లో భారీ దోపిడీ జరిగింది.. దొంగలు బీభత్సం సృష్టించారు.. సోమవారం రాత్రి దొంగలు బ్యాంకు వెనుక ఉన్న కిటికీని గ్యాస్ కట్టర్ తో కట్ చేసి బ్యాంకులోకి చొరబడ్డారు.. అనంతరం దుండగులు భారీ ఎత్తున 19 కిలోల బంగారం అపహరించుకువెళ్లారు. బ్యాంక్ సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. భారీ దొంగతనం కేసులో నిందితుల కోసం వేట కొనసాగుతోంది.. ఈ భారీ దోపిడీ వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రం లోని సీబీఐ బ్రాంచ్ లో సోమవారం అర్థరాత్రి జరిగింది.. బ్యాంకులో బంగారం నిల్వ ఉన్న లాకర్లను మాత్రమే పగలగొట్టి లాకర్లలో ఉన్న బంగారాన్ని దొంగిలించారు. ఎప్పటిలాగే బ్యాంకు తెరిచిన అధికారులకు లాకర్లు పగలగొట్టి ఉండడంతో నివ్వెరబోయారు. బ్యాంకులో భారీ ఎత్తున దోపిడీ జరిగినట్లు నిర్ధారించుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలను సేకరించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే.. లాకర్లలో భద్రపరచిన 19 కిలోల బంగారం మొత్తం దోపిడీకి గురి కావడం పట్ల.. ఇంటి దొంగల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 13 కోట్ల రూపాయల విలువగల బంగారం అపహరణకు గురైనట్లు పేర్కొంటున్నారు.

బ్యాంకులో దొంగతనం జరిగిన విషయం బయటకు తెలియడంతో బ్యాంకులో బంగారాన్ని కుదువపెట్టి లోన్లు తీసుకున్న బాధితులు, లాకార్లలో బద్రపర్చుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.. పోలీసులు, బ్యాంక్ అధికారుల నుండి వివరాలు సేకరిస్తున్నారు.

లాకర్‌లో బంగారం చోరీ విషయం తెలిసి 474 మంది ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. చోరీకి గురైన బంగారం విలువ దాదాపు 13 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. బాధితులు బ్యాంక్‌ వచ్చి ఆందోళన చేస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది..

వీడియో చూడండి..

హార్డ్ డిస్క్ లు ధ్వంసం..

అయితే బ్యాంక్ వెనుక భాగంలో కిటికీని గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన దొంగలు లోపలికి ప్రవేశించిన వెంటనే సీసీ కెమెరా హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారు.. లాకర్ లను పగులగొట్టి బంగారం లూఠీ చేశారు.. సీసీటీవీ డీవీఆర్‌లను సైతం ఎత్తుకెళ్లారు. ఇది అంతర్ రాష్ట్ర దొంగల పనా..? లేక ఇక్కడి వారే దోపిడీకి బరితెగించారా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది..

ఇదిలాఉంటే.. ఇదే తరహాలో కర్నాటక దవణగెరె జిల్లాలోని బ్యాంక్‌లో‌ చోరీ జరిగింది.. ఈ దోపిడీ కూడా ఆ దొంగల ముఠా పనిగా భావిస్తున్నారు పోలీసులు.. నాలుగు స్పెషల్‌ టీమ్స్‌ను దర్యాప్తు కోసం రంగంలోకి దించి.. దర్యాప్తును వేగవంతం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!