AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dollar vs Rupee: కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?

Dollar vs Rupee: కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?

Anil kumar poka
|

Updated on: Nov 19, 2024 | 6:20 PM

Share

మీరు గమనించారో లేదో కానీ.. రూపాయి విలువ తగ్గిపోతోంది. అయితే ఏంటట అని అనుకోవచ్చు. కానీ దానివల్ల ఎలాంటి నష్టం, కష్టం వస్తుందో తెలిస్తే మాత్రం.. వామ్మో! రూపాయి విలువ పడిపోతే రిజల్ట్ ఇలా ఉంటుందా అని ఆందోళన చెందుతారు. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి కదా అని సంతోషపడాలో.. రూపాయి విలువ పడిపోతోంది అని బాధపడాలో తెలియని సందర్భం. రూపాయి పడిపోతోంది. అటు డాలర్ బలపడుతోంది.

మీకు ఈ విషయం అర్థం కావడానికి ఇంకా ఈజీగా ఉండేలా ఓ ఉదాహరణ చెబుతాను. పదేళ్ల కిందట.. అంటే 2014లో డాలర్ విలువను మన రూపాయిల్లో లెక్కేస్తే.. దాదాపు 62 రూపాయిలు ఉంది. ఇప్పుడు 84 రూపాయిలు దాటింది. అంటే.. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు 2014లో లక్ష డాలర్లు ఇండియాకు పంపిస్తే.. అది మన కరెన్సీలోకి వచ్చేసరికి.. దాదాపు 62 లక్షలు అవుతుంది. అదే లక్ష డాలర్లను ఇప్పుడు పంపిస్తే.. 84 లక్షల రూపాయిలకు పైగా వస్తుంది. జస్ట్ పదేళ్లలో ఎంత తేడా వచ్చింది? 22 లక్షల రూపాయిలు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ డాలర్ విలువ పెరుగుతోంది. రూపాయి విలువ ఎవా ఉంటోందో చూస్తున్నాం. ఇంతకీ రూపాయి విలువ తగ్గితే ఎవరికి లాభం? రూపాయి విలువ పెరిగితే ఎవరికి నష్టం? అసలు దీనివల్ల మన భారతీయుల నిత్య జీవితంపై పడే ఎఫెక్ట్ ఎంత? వస్తు తయారీ సంస్థలకు లాభాలు తెచ్చిపెడుతుంది డాలర్లను మన దేశ కరెన్సీలోకి మారిస్తే.. ఎక్కువ మొత్తం వస్తుంది రూపాయిల విలువ పడిపోతే ఏఏ రంగాలు లాభపడతాయో చూస్తే.. మన దగ్గరి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేవాళ్లంతా మంచి ప్రయోజనం పొందుతారు. అంటే ఫార్మా, ఐటీతో పాటు ఎగుమతులు చేసే.. వస్తు తయారీ సంస్థలకు ఇది లాభాలు తెచ్చిపెడుతుంది. దీనికి అసలు కారణం ఏంటంటే.. వీళ్లు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు.. తమకు రావలసిన మొత్తాన్ని డాలర్లలో తీసుకుంటారు. ఆ...